దేశాభివృద్ధికి భావి ఇంజనీర్లే పునాది

17 Oct, 2014 01:20 IST|Sakshi

మెట్రో రైలు చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వీబీ గాడ్గిల్

వరంగల్: దేశాభివృద్ధికి భావి ఇంజనీర్లే పునాది అని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం కలలు కన్నట్టు 2020 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఎల్‌అండ్ టీ మెట్రో రైలు చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వీబీ గాడ్గిల్ పిలుపు నిచ్చారు. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో గురువారం టెక్నోజియాన్-2014 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథి గా హాజరైన వీబీ గాడ్గిల్  నిట్ ఆడిటోరియంలో జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో దేశం గర్వించదగ్గ మెట్రోరైలు ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశామన్నారు.

కేంద్రం పంచవర్ష ప్రణాళిక, తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ద్వారా కొత్త ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నోజియాన్-2014లో పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంశంగా చేర్చుకోవడం మంచి పరిణామమన్నారు. టెక్ వేదిక సీఈవో సాయి సంగి నేని, వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావు,స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఎస్.శ్రీనివాసరావు, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు