నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

12 Nov, 2014 22:01 IST|Sakshi
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

కడప: వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సమీపంలోని అటవీ ప్రాంతంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన దుంగలతోపాటు స్మగ్లర్లను పోలీసులు స్టేషన్కు తరలించారు.

స్మగ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నలుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు