నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోపీ

18 Aug, 2019 09:04 IST|Sakshi

ఖాతాదారులను బుక్‌ చేసిన బ్యాంకు అప్రైజర్‌

90 మంది పేరిట రూ.60 లక్షల రుణాలు

సీతమ్మధార (విశాఖ ఉత్తర): సీతంపేట ఇండియన్‌ బ్యాంక్‌లో బంగారు రుణాల పేరిట వెలుగు చూసిన మోసంపై ఆ బ్యాంకు అధికారులు స్పందించారు. తీవ్ర చర్చల తర్వాత శనివారం రాత్రి బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ సంతోష్‌కుమార్, అధికారులు ద్వారకనగర్‌ సీఐ వై.మురళీరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ నిర్వహించారు. పోలీసులు, బ్యాంకు అధికారులు చెప్పిన వివరాలు.. తీసుకున్న రుణం కన్నా అదనపు సొమ్ము చెల్లించాలని ఇండియన్‌ బ్యాంక్‌ సీతంపేట శాఖ నోటీసులు పంపడంతో వ్యవహారం బయటపడింది. బ్యాంకు అధికారులు నలుగురు ఖాతాదారులకు బ్యాంకు నుంచి తీసుకున్న బంగారు రుణాలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఖాతాదారులు లబోదిబో మంటూ శుక్రవారం రాత్రి ద్వారకజోన్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు రాబట్టారు. నోటీసులు అందుకున్న రమణ, పైడిరాజు, ఫణికుమార్‌లను పోలీసులు పలు ప్రశ్నలు వేశారు. తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని, కొంత సొమ్ము చెల్లించామని, నోటీసు ఇచ్చిన ప్రకారం అంతసొమ్ము చెల్లించలేమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాంచి అప్రైజర్‌ శ్రీనుబాబు గత నెల 29న చనిపోయారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఖాతాదారుల రుణాలను పెంచి, నకిలీ బంగారం సృష్టించి రూ.60 లక్షలు అప్రైజర్‌ శ్రీను బాబు స్వాహా చేసినట్టు సీఐ వై.మురళీరావు తెలిపారు. మొత్తం 90 అకౌంట్లు గుర్తించినట్టు ఆయన వివరించారు.

నోటీసు పంపడంతో బయటకు..
ఈ నోటీసు పట్టుకొని బ్యాంకుకు వెళ్లగా పెద్దగా స్పందన లేకపోవడంతో బాధితులు ద్వారకనగర్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బ్యాంకులో రుణాలు సంగతి బయట పడింది. బ్యాంకు లావాదేవీలు చిన్న విషయం కాదని, ఎలాంటి సంతకాలు చేయలేదని, కాని రూ. పది లక్షలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం అన్యాయమని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

గోల్‌మాల్‌పై కేసు నమోదు..
ఇండియన్‌ బ్యాంకు సీతంపేట శాఖలో బంగారు ఆభరణాల రుణాలపై జరిగిన గోల్‌మాల్‌పై ద్వారకాజోన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శనివారం రాత్రి బ్యాంకు అధికారులు మోసం జరిగిందని బ్యాంకు అధికారులు వచ్చి సీఐ వై.మురళీరావుకు ఫిర్యాదు చేశారు. అసలు బంగారం ముసుగులో నకిలీ బంగారాన్ని ఖాతాదారుల ప్రమేయం లేకుండా జత చేయడంతో సుమారు 90 మందికి పైగా సుమారు రూ.60 లక్షలు వరకు కుచ్చుటోపీ వేసిన సంగతి విషయం విదితమే. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ దాలిబాబు తెలిపారు.  
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మద్యం విచ్చలవిడి అమ్మకాలకు చెక్‌

పొట్టి రవిపై పీడీ యాక్టు

కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం

నీ ఇష్టమొచ్చినోడికి చెప్పుకో ! 

ఖండాలు దాటినా.. మీ ప్రేమకు సెల్యూట్‌ : సీఎం జగన్‌

జీఎస్టీ ఆదాయానికి గండి

జల దిగ్బంధంలో లంక గ్రామాలు 

జీవనాడికి రెండేళ్లలో జీవం!

కోడెల కుమారుడిపై కేసు 

‘లోటు’ తీరుతుంది!

రీ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా

శాంతిస్తున్న కృష్ణమ్మ

చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారు

టెన్త్‌ పరీక్షల్లో సమూల మార్పులు!

‘పోలవరం’ రివర్స్‌ టెండరింగ్‌కు నోటిఫికేషన్‌

‘నవలి’కి నో!

పెట్టుబడులకు అనుకూలం

సీఎం వైఎస్‌ జగన్‌ అమెరికా నుంచి సమీక్ష

డల్లాస్‌లో సీఎం జగన్ సమావేశ సందడి షురూ

కృష్ణా వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

ఫలించిన దుర్గ ఆలయ శాంతి పూజలు 

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీ పర్యటన

కొడుకు వైద్యం కోసం వచ్చి అనంత లోకాలకు..

ఈనాటి ముఖ్యాంశాలు

పోలవరం రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ

ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన మంత్రి పేర్నినాని

‘వరదలతో బురద రాజకీయాలా?’

‘సీఎం జగన్‌ పాలన దేశంలోనే రికార్డు’

సీఎం జగన్‌ను ఒప‍్పిస్తా: పృథ్వీరాజ్‌

‘సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట