రూ.187 కోట్లకు టోకరా!

12 Nov, 2017 02:10 IST|Sakshi

   షేర్‌ మార్కెట్‌ పేరుతో మోసగించిన యువకుడు

     లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు

     నిందితుడికి టీడీపీ నేతల అండదండలు!

రాజాం: శ్రీకాకుళం జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. రూ.187 కోట్లకు టోకరా పెట్టి ఇన్వెస్టర్లను ఓ యువకుడు నట్టేట ముంచాడు. ఈ ఘటన రాజాం నియోజక వర్గంలోని సంతకవిటి మండలంలో చోటు చేసుకుంది. సంతకవిటి మండలం మంద రాడకు చెందిన ఓ యువకుడు ఇండీట్రేడ్‌ పేరుతో రాజాంలోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా నాలుగేళ్ల క్రితం షేర్‌మార్కెట్‌ కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఒకరిద్దరికి లాభాలను చూపించడంతో దాదాపు 300 మంది ఇన్వెస్టర్లు రూ.187 కోట్లను ఒకరికి తెలియకుండా మరొకరు షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టారు. ఏడాది క్రితం ఈ కార్యాలయాన్ని సంతకవిటి మండలం తాలాడకు  యువకుడు మార్చాడు.  గతేడాది పెద్దనోట్ల రద్దు తరువాత నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇన్వెస్టర్లకు చూపించ లేదు.

ఏడాదిగా వాయిదా వేసుకుంటూ వస్తుండటంతో సహనం నశించిన ఇన్వెస్టర్లు ఇటీవల గట్టిగా నిలదీశారు. తమ పెట్టు బడులు ఇచ్చే యాలని డిమాండ్‌ చేయగా ట్రేడ్‌ యజమాని ఈనెల 10కి వాయిదా వేసి ఉన్నపళంగా షేర్‌ మార్కెట్‌ కార్యాల యానికి, మందరాడ గ్రామంలోని తన ఇళ్లకు తాళాలు వేసి ఉడాయించాడు. దీంతో పెట్టుబడి దారులం తా లబోదిబోమంటున్నారు. ఇలా ఉండగా షేర్‌ మార్కెట్‌ యజమాని తన రక్షణ నిమిత్తం 303 మం దిపై కేసులు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్ట్‌ చేయడానికి స్థానిక టీడీపీ నేతల తోపాటు జిల్లాకు చెందిన ఓ మంత్రి అండ దండలున్నాయనే ఆరోపణలు వస్తు న్నాయి. ప్రస్తుతం ఈ యజమానిపై ఎటు వంటి కేసులు లేకుండా ఆ నేతలు నెట్టుకొస్తు న్నట్లు తెలుస్తోంది. కోట్లకు టోకరా పెట్టిన యజమానిపై ఇంత వరకు ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని రాజాం రూరల్‌ సీఐ వీరకుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు