పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు

29 May, 2018 11:57 IST|Sakshi
శిక్షణకు హాజరైన విద్యార్థులు

ప్రతి పేద విద్యార్థి కల ప్రభుత్వ ఉద్యోగం సాధించటం. అందుకోసం అప్పుచేసి వేలకు వేలు కోచింగ్‌ సెంటర్లకు ఫీజుగా చెల్లిస్తూ, అరకొర వసతులతో, పస్తులతో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు యువత. వీరందరికీ ఒక మంచి భవిష్యత్తును నిర్మించాలనుకుని నడుం కట్టింది ఓ స్వచ్ఛంద సంస్థ. వీరికి ఉచిత తరగతులు నిర్వహిస్తూ, వసతితో కూడిన భోజన సౌకర్యం కల్పిస్తూ తమ సేవలందిస్తుంది. ఇప్పటిదాకా వంద మంది యువతీ, యువకులు వీరి శిక్షణను ఉపయోగించుకొని ఉద్యోగాలను సాధించారు. 

సాక్షి, నంద్యాల : నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్‌సీ నిర్వహించే గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4, వీఆర్‌ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడునని, కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు.

అలాగే రైల్వే బోర్డ్‌ నిర్వహించే గ్రూప్‌-సి, గ్రూప్‌-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూన్‌ 15వ తేదీ తరగతులు నిర్వహిస్తామని, ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్‌, డీఎస్సీ తరగతులను జూన్‌ 21వ తేదీన తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్‌ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్‌(శిక్షణ భృతి) కల్పించబడునని, అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు.

తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహిస్తామని, శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్‌, నంద్యాల. మరింత సమాచారం కొరకు 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు.

మరిన్ని వార్తలు