-

పేదల కోసం ఉచిత గ్యాస్ పథకం

16 Feb, 2015 01:30 IST|Sakshi
పేదల కోసం ఉచిత గ్యాస్ పథకం

 కొత్తవలస(లక్కవరపుకోట): దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కు టుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వ ర్తింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం రూపొందించిందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు కె.హరిబాబు తెలి పారు. కొత్తవలస మండలంలో ఆది వారం జరిగిన ఓ కార్యక్రమంలో పా ల్గొన్న ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ఉచిత గ్యాస్ పథకం రా ష్ర్టంలోని 13 జిల్లాల వారికి వర్తిస్తుందని అన్నారు. పథకం ప్రకారం గ్యాస్ కనెక్షన్ పొందేందుకు దారిద్య్ర రేఖ దిగువన ఉన్నట్లు తెలిపే ధ్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు జిరాక్సులు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను సమీపంలోని గ్యాస్ డీలర్లకు అందించాలని సూచిం చారు. పథకం గురించి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి, టీడీపీ, బీజేపీ నాయకులకు సూచించారు.  
 
 ఆడపిల్లలను చదివించండి
 వేములాపల్లి(శృంగవరపుకోట): ఆడపిల్లలను ఉన్నత విద్యావంతుల్ని చేయాలని విశాఖ ఎంపీ హరిబాబు కోరారు. వేములాపల్లి గ్రామంలో ఆదివారం ‘మన విలే జెస్’ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
 
  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించాలని, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఐఎస్‌ఎల్ నిర్మాణానికి రూ.1000ల ఆర్థిక సాయం అందిస్తామని సంస్థ ప్రతినిధులు చేసిన ప్రకటనపై ఎంపీ స్పందిస్తూ ఆర్థిక పరిస్థితి గుర్తించి ఆ మొత్తాన్ని పెంచాలని కోరా రు. గ్రామంలో పన్నెండేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ జన్‌ధన్‌యోజన ఖాతాలు తెరవాలని అధికారులను కోరారు. గ్యాస్ కనెక్షన్లు లేని వారికి తెల్లరంగు రేషన్‌కార్డు ఉన్నవారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో  ఎస్.కోట నియోజక వర్గ బీజేపీ ఇన్‌చార్జి రఘురాజు, మన విలేజెస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డా క్టర్ బురిడి నాగభూషణం, డాక్టర్ జి.పద్మ సంపూర్ణ కళ్యాణి, డాక్టర్ జి.కాశీపతిరాజు, తహశీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ గౌరీశంకర్ తదితరులు మాట్లాడారు. అనంతరం సంస్థ సభ్యులు ఏర్పా టు చేసిన దుప్పట్లు, దుస్తులు గ్రామస్తులకు ఎంపీ అందించారు. అనంతరం పలువురు నేతలను సత్కరించారు.
 
 ‘ఆంధ్రను అగ్రరాష్ట్రం చేస్తాం’
 శృంగవరపుకోట : ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా చేస్తామని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక గౌరీ సేవా సంఘం కల్యాణ మండపంలో బీజేపీ ఎస్.కోట నియోజకవర్గ ఇన్‌చార్జ్ రఘురాజు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాలను సమీక్షించారు. బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టేందుకు కృషి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకించినా ప్రధాని భాద్యతీ తీసుకుని క్లియరెన్స్ ఇచ్చారన్నారు. రాష్ట్రానికి ఐఐటీ, ఎ.ఐ.ఎం.ఎస్, ఐఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలు కేటాయించారని తెలిపారు. అలాగే జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. లక్కవరపుకోటను దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.   
 

మరిన్ని వార్తలు