‘ఎల్‌జీ పాలిమర్స్‌’ బాధితులందరికీ ఉచితంగా వైద్యం

8 May, 2020 04:23 IST|Sakshi

ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్జున వెల్లడి

సాక్షి, అమరావతి: ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో అనారోగ్యం పాలైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డా.మల్లికార్జున పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తామని, ఏ ఒక్కరూ పైసా చెల్లించకుండా ఆస్పత్రులకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 
► గ్యాస్‌ ఘటన ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనైనా ఎలాంటి ఫీజూ లేకుండా వైద్యానికి వెళ్లొచ్చు. 
► సదరు ఆస్పత్రి ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోయినా సరే వైద్యం ఉచితంగా అందించాలని ఆదేశాలిచ్చాం. ఇప్పటికే ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా అన్ని ఆస్పత్రులకు సమాచారం అందించాం. 
► వైద్యానికి వచ్చే బాధితుల ఆధార్‌ కార్డు, ఇతర వివరాలను తీసు కుని చికిత్స చేయాలి. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 
► వైద్యం అనంతరం ఆస్పత్రులు సంబంధిత బిల్లులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపిస్తే సొమ్ము చెల్లిస్తాం. 
► గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలు సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందాలని కోరుతున్నాం. 
► అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశాం. డా.డి.భాస్కరరావు, జిల్లా కోర్డినేటర్, 8333814019 నంబర్‌కు కాల్‌ చేస్తే వెంటనే స్పందిస్తారు.

మరిన్ని వార్తలు