నేటి నుంచి ఉచిత సరుకుల పంపిణీ

20 Jul, 2020 05:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: బియ్యం కార్డుదారులకు నేటి (సోమవారం) నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఉచిత సరుకుల పంపిణీ జరగనుంది. కోవిడ్‌–19 వైరస్‌ కారణంగా ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటికే లబ్ధిదారులకు ఏడు సార్లు ఉచితంగా సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా 8వ విడతలో భాగంగా కార్డులో పేర్లు నమోదై ఉన్న ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా 1.49 కోట్ల కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. 

మరిన్ని వార్తలు