సమరోత్సాహం

12 Sep, 2018 07:11 IST|Sakshi
సమావేశ ప్రాంగణంలో పార్టీ నేతల కోలాహలం

సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలో నెల రోజులుగా అప్రతిహతంగా సాగుతోంది. గ్రామీణ విశాఖలో జరిగిన ఏడు బహిరంగ సభలు రికార్డులు తిరగరాస్తే.. విశాఖలో జరిగిన కంచరపాలెం సభ ఏకంగా కొత్త రికార్డులను సృష్టించింది. వాటికి తోడు తాజాగా విశాఖ వేదికగా మంగళవారం జరిగిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తల రాష్ట్రస్థాయి సమావేశంలో జననేత పూరించిన ఎన్నికల శంఖారావం పార్టీ జిల్లా శ్రేణుల్లో సమరోత్సాహం నింపింది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కో–ఆర్డినేటర్ల సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించడం వారిలో ఉత్తేజం నింపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏకబికిన సాగిన ఆ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు సమన్వయకర్తలు.. ఇలా పార్టీలో అగ్రనేతలంతా తరలిరావడంతో విశాఖలో ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంది.

బీచ్‌రోడ్‌లో కోలాహలం
సభావేదిక పెదజాలరిపేట సమీపంలో విశాఖ ఫంక్షన్‌ హాలు కావడంతో బీచ్‌రోడ్‌తోపాటు నగరమంతా కోలాహలం నెలకొంది. ఏ నలుగురు కలిసినా బీచ్‌రోడ్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ల సమావేశం కోసమే చర్చ జరిగింది. టీవీలకు అతుక్కుపోయిన జనం సైతం ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో.. పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తిని కనబరిచారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

299వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

నిలువెత్తు నమ్మకం.. కొండంత ధైర్యం...

చెరకు రైతులను ఆదుకోవాలి

డిగ్రీ కళాశాల లేక ఇక్కట్లు..

నిధులు మంజూరైనా..

మైదాన ప్రాంత ఎస్టీలను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవాలి

చిన్నచూపు..

చంద్రబాబుది స్వార్థ రాజకీయం

జగన్‌ వస్తేనే జాబు

వైఎస్సార్‌ సీపీకి అనుకూలమని..

298వ రోజు పాదయాత్ర డైరీ