నిప్పుల వాన..!

14 Apr, 2019 08:30 IST|Sakshi

కడప రూరల్‌: ఈ ఎండాకాలం చాలా ‘హాట్‌’గా మారింది. వేసవి సెగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అప్పుడే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటేలా కనిపిస్తోంది. ‘నిప్పుల వాన’ పడుతోందా...? అనేఅ భావన జనంలో కలుగుతోంది. వేడికి మించి ఉక్కపోత ఉండటంతో ఇంట్లో నుంచి బయటపకు అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. ఉదయం 8.30 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మ«ధ్యాహ్నం సమయంలో విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రోజూ సగటున 43 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రంలో కడప ఉష్ణోగ్రతలో టాప్‌గా నిలుస్తూ కలవరపరుస్తోంది. రాత్రి వేళ గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో ఉక్కపోత  ప్రభావం కనిపిస్తోంది.

 బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం తదితర నియోజక వర్గ ప్రాంతాల్లో ఈ ప్రభావం మొదటిపేజీ తరువాయిఎక్కువగా కనిపిస్తోంది. నదీ తీరం, కొండలున్న ఏరియాల్లో ‘సెగ’ మరింతగా జనాలకు మంట పెట్టిస్తోంది. వర్షాలు సరిగా పడకపోవడం..çకనుచూపు మేర కరువు ఛాయలు ఏర్పడడం. పచ్చదనం లేకపోవడం తదితర కారణాలతో వేసవి అందరినీ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పుడే గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. ఈ వేసవిలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు