స్వయం ఉపాధి.. జాప్యంతో సమాధి

18 Oct, 2014 03:47 IST|Sakshi
స్వయం ఉపాధి.. జాప్యంతో సమాధి

* నిరుద్యోగ యువతకు రుణాలు ఎండమావే
* స్వయం ఉపాధి పథకాలకు నిధులు కేటాయించని సర్కారు   
 
 ఏలూరు : బాబు వస్తే జాబు.. ఉద్యోగం దొరకని వారికి రూ.2,500 చొప్పున నిరుద్యోగ భృతి వస్తుందని ఎన్నికల సమయంలో వెలువడిన ప్రకటనలు చూసి నిరుద్యోగులంతా సంబరపడ్డారు. ఏదో ఒక రూపంలో తమకు ఆసరా దొరుకుతుందనుకున్నారు. జాబు, నిరుద్యోగ భృతి మాట దేవుడెరుగు.. కనీసం స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు సైతం మంజూరుకాక వారంతా ఆవేదన చెందుతున్నారు. కనీసం తమ కాళ్లపై తాము నిలబడదామనుకుంటున్న యువతకు చేయూత అందటం లేదు. స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నిరుద్యోగుల భవిష్యత్ ఎండమావిగా కనిపిస్తోంది.
 
రుణాల కోసం 10 వేల మంది ఎదురుచూపు
ఏటా బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్లతోపాటు సెట్వెల్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద నిరుద్యోగులకు రుణాలు ఇస్తున్నారు. అరుుతే, రెండేళ్లుగా జిల్లాలోని ఒక్క నిరుద్యోగికైనా స్వయం ఉపాధి యూనిట్ మంజూరు కాలేదు. గత ఏడాది అప్పటి సర్కారు నిర్లక్ష్యం వల్ల రుణాల మం జూరులో జాప్యం జరిగింది. తీరా రుణాలిచ్చే సమయూనికి పంచాయతీ ఎన్నికలు రావడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. దాదాపుగా 10వేల మందికి రుణం ఇచ్చేందుకు నిర్ణయించిన ఆయూ విభాగాల అధికారులు ప్రభుత్వానికి తిరిగి ప్రతిపాదనలు పంపించారు.

అయితే, నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదు. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాల కింద వివిధ యూనిట్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. పాత వారికే రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం వల్ల ప్రయోజనం ఉండదనే భావనతో అధికారులు ఉన్నారు. ఈ కారణంగానే ప్రతిపాద నలు రూపొందించడం లేదు.
 
ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులిచ్చినా...
జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు కేటారుుంచింది. 5,073 యూనిట్లు స్థాపించాలనే లక్ష్యంతో రూ.42.26 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డారుు. ఇందుకు సంబంధించి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రుణ ప్రణాళికను ఆమోదించాల్సి ఉంటుంది. బీసీ, మైనార్టీ, సెట్వెల్ ద్వారా కేటాయింపులు లేకపోవడంతో ఇప్పట్లో బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగే అవకాశం లేదని సమాచారం. ఈ కారణంగా నిధులు కేటారుుంచినా ఎస్సీ నిరుద్యోగులకు ఇప్పట్లో రుణాలు అందే పరిస్థితి కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు