ప్రభుత్వానికి అండగా...వారంతా ఉండగా

8 Jun, 2020 20:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అండగా నిలవడానికి సామాన్యుల నుంచి పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సీఎం సహాయ నిధికి తమ వంతుగా సాయాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగానే కేసీపీ షుగర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కేసీపీ షుగర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జి.వెంకటేశ్వరరావు, వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఎ.బాలసుబ్రమణ్యం, ఫార్మర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జే.మోహన్‌ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పార్ధసారధి పాల్గొన్నారు. (ఇకఆరోగ్య సేతుబాధ్యత వారిదే..)

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వ్యాపారవేత్తలు, స్వచ్ఛందసంస్ధలు,వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు తరపున కరోనా వైరస్‌పై పోరాడటానికి సీఎం సహాయ నిధికి 64 లక్షల 50వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ చెక్కులను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌కు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యానారాయణ రెడ్డి, ఎస్‌.కృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీకృష్ణారెడ్డి అందజేశారు. (బట్టతల వారికి కరోనా వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకంటే)

మరిన్ని వార్తలు