ఆయిల్‌పామ్‌కు ఆధరణ

28 Jan, 2020 13:35 IST|Sakshi

మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌  

 ధరల వ్యత్యాసాల నష్టం పూడ్చేందుకు నిధులు

 రైతుల ఆనందోత్సాహాలు  

 ఖాతాల్లో నగదు జమచేయనున్న కంపెనీలు  

ఆయిల్‌పామ్‌ రైతుల ఆనందం ఆకాశాన్ని తాకింది. ప్రతి కర్షకుని మోముపై ‘ధర’హాసం చిందులేసింది. హృదయాలు సంతోషంతో బరువెక్కాయి. జననేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, తమ మనసులు గెలుచుకున్నారని ఉప్పొంగిపోయాయి.    

జంగారెడ్డిగూడెం/ద్వారకాతిరుమల: ధరల వ్యత్యాసంతో నష్టపోయిన ఆయిల్‌పామ్‌ రైతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.   ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆయిల్‌ గెలల టన్ను ధరలో ఎక్కువ వ్యత్యాసం ఉంది. అలాగే ఓఈఆర్‌ (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌) 1.72 శాతం వ్యత్యాసం ఉంది. దీంతో రైతులకు టన్నుకు రూ.500 నుంచి రూ.600లకు పైగా నష్టం వచ్చేది. రైతులు అవస్థలు పడ్డారు. దీనిపైగత ప్రభుత్వాన్ని వేడుకున్నా.. ఉపయోగం లేకుండా పోయింది. ఈ సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయిల్‌పామ్‌ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అప్పట్లో ఆయిల్‌పామ్‌ రైతుల కోసం ఇప్పటి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు 2018 నవంబర్‌ 1 నుంచి మూడు రోజులపాటు ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్‌.పోతేపల్లి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ వద్ద దీక్ష కూడా చేశారు. అయినా అప్పటి ప్రభుత్వంలో చలనం లేకపోయింది. అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ రైతులకు అండగా నిలిచింది.  2018 నవంబర్‌ నుంచి 2019 అక్టోబర్‌ వరకు రైతులు నష్టపోయిన వ్యత్యాసాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం 76,01,43,673 రూపాయలను విడుదల చేసింది. 3 పనిదినాల్లో ఈ నగదును రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆయా ఆయిల్‌ కంపెనీలను ఆదేశించింది. ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  2018 అక్టోబర్‌ నుంచి 2019 నవంబర్‌ వరకు ఆంధ్ర, తెలంగాణల్లో నెలవారీగా ఏడాది కాలం ఆయిల్‌ గెలల ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించేలా నిధులు మంజూరు చేశారు.  

మరిన్ని వార్తలు