భవిష్యత్ నానో టెక్నాలజీదే

11 Nov, 2013 02:54 IST|Sakshi
 పెనుగొండ, న్యూస్‌లైన్ : నానో టెక్నాలజీకి మంచి భవిష్యత్ ఉందని, ఒక నానోమీటర్‌ను ఉపయోగించి అణువు, అంతకంటే తక్కువ పరిమాణం గల పదార్థాల కొలమానంపై అంచనాకు రావచ్చని హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆనంద్‌పాఠక్ అన్నారు. స్థానిక ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్‌రాజు ఆర్ట్స్ అండ్ సైన్‌‌స  కళాశాల సెమినార్ హాల్‌లో  కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ రెండో రోజు వర్కుషాప్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. నానో టెక్నాలజీతో కంప్యూటర్ మెమొరీ సామర్థ్యం పెంచవచ్చని, వైద్యరంగంలో క్యాన్సర్ కణాలను నియంత్రించడానికి నానో ట్యూబ్‌లు ఉపయోగపడతాయని చెప్పారు.
 
 వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ హైదరాబాద్‌కు చెందిన మన్నం కృష్ణమూర్తి విజ్ఞానశాస్త్రం నిర్వచనం, రసాయన శాస్త్ర ప్రాధాన్యతలను, హైడ్రోకార్బన్ వర్గానికి చెందిన నూనెలు, కొవ్వు పదార్థాల  సంక్లిష్ట నిర్మాణాల గురించి వివరించారు. హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వి.కన్నన్ మాట్లాడుతూ సంఖ్యాశాస్త్రంలో రెండో ఘాతం గురించి వివరించారు. అనంతరం భౌతికశాస్త్రం, కంప్యూటర్, రసాయన శాస్త్రం, బాటనీ, జువాలజీలో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేశారు. ప్రిన్సిపాల్ జె.రాజేశ్వరరావు, క్యాంప్ కో-ఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్.శ్రీనివాసరావు, అకాడమిక్ కో-ఆర్డినేటర్ ఆర్‌కే కొండముది, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు