నాలుగు విడతలుగా డ్వాక్రా రుణాలు రద్దు

4 Nov, 2019 20:46 IST|Sakshi

డీఆర్‌డీఏ పథకాలను సక్రమంగా అమలుచేయాలి

సమీక్షలో  ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

సాక్షి, కడప: డీఆర్‌డీఏ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సక్రమంగా అమలుచేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలో జరిగిన  నియోజకవర్గ స్థాయి డీఆర్‌డీఏ పథకాల సమీక్షలో  శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.  స్వయం సహాయక సంఘాల  గ్రేడింగ్, వైఎస్ఆర్ ఆసరా, స్త్రీ నిధి, ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ పెళ్లికానుక తదితర పథకాలపై నియోజకవర్గ పరిధిలోని మండలాల వారీగా ఆయన సమీక్షించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 4363 స్వయం సహాయక సంఘాలలో 96 శాతం సంఘాలు మంచి గ్రేడ్లును సాధించడం అభినందనీయమన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకుని పథకాల లక్ష్యాలును అధిగమించాలన్నారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అత్యంత చేరువ కావాలన్నారు.

4 విడతలుగా డ్వాక్రా రుణాలను  రద్దు..
నవరత్న పథకాలులో భాగంగా హామీ ఇచ్చిన డ్వాక్రా ఋణాలును 4 విడతలుగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాపీ చేయనున్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటి నియోజక వర్గ వ్యాప్తంగా  మున్సిపాలిటీ పరిధిలో రూ.22 కోట్లు, 6 మండలాలకు గాను రూ. 81.8 కోట్లు ఋణాలను మాపీ చేయడం జరుగుతుందన్నారు. వెలుగు గ్రామ సమాఖ్యలకు గత ప్రభుత్వంలో రూ.25 లక్షలు  ఋణాలుగా ఇచ్చేవారని, జగన్ ప్రభుత్వంలో రూ. 50 లక్షలు వరకు గ్రామ సమాఖ్యలకు ఋణాలును ఇవ్వడం జరుగుతోందన్నారు. బ్యాంకు ఋణాలుతో పాటు స్త్రీ నిధి ఋణాలును రూ.1 లక్ష వరకు ఇవ్వడం జరుగుతోందన్నారు. జగన్ ఐదు నెలల పాలనలోనే ఏ రాష్ట్రంలో అమలుచేయని ప్రజా సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన,మహిళా సంక్షేమానికి కృషి చేయడం జరుగుతోందన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం చిట్టచివరి నిరుపేద వరకు  అందించడమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

చీఫ్ విప్ కు సన్మానం..
ప్రభుత్వ చీఫ్ విప్  శ్రీకాంత్ రెడ్డి కి డీఆర్‌డీఏ ఉద్యోగ సిబ్బంది సోమవారం జరిగిన సమావేశం లో భాగంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని అభ్యర్ధించారు. సిబ్బంది విన్నపాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళతానని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు