కోడెలను చంద్రబాబు వేధించారు: గడికోట

17 Sep, 2019 12:00 IST|Sakshi

ఛలో ఆత్మకూరుకు కోడెల వస్తానంటే అడ్డుకున్నారు

చంద్రబాబు, వర్ల రామయ్య కోడెలపై ఆరోపణలు చేశారు

చంద్రబాబు శవ రాజకీయలు చేయడం తగదు

కోడెల మరణం బాధాకరం: గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, అమరావతి: టీడీపీలో ఎదురైన అనేక అవమానాలతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. గత రెండు నెలలుగా కోడెల అనారోగ్యంతో బాధపడుతున్నా.. చంద్రబాబు కనీసం పరామర్శించలేదని గుర్తుచేశారు. ఛలో ఆత్మకూరుకు కోడెల వస్తానంటే టీడీపీ నేతలు ఆయన్ని ఆడ్డుకున్నారని, వర్గ రామయ్య కూడా ఆయనపై అనేక ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేతల అవమానాలు భరించలేకే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.

చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ.. శవ రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  కోడెల మరణం చాలా బాధాకరమన్న ఆయన.. చంద్రబాబు వేధింపుల కారణంగానే కోడెల మృతి చెందారని ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు చేస్తోందని.. ఓ వర్గాన్ని మాత్రమే చంద్రబాబు పోత్రహిస్తూ కోడెలను అవమానానికి గురిచేశారని పేర్కొన్నారు. కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టలేదని, కేవలం బాధితులు మాత్రమే పెట్టారని ఆయన స్పష్టం చేశారు.

‘ఎన్నికల అనంతరం కోడెల అస్వస్థతకు గురయ్యారు. రెండు నెలల్లో కనీసం ఒక్కసారి కూడా చంద్రబాబు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయలేదు. బతికున్నప్పుడు మనుషులను వేధించడం చంద్రబాబుకు బాగా తెలుసు. చనిపోయిన తరువాత శవ రాజకీయాలను చేయడం ఆయనకు ఎంతో సులువు. ఎన్టీఆర్‌, హరికృష్ణ మరణం సమయంలో ఇలాంటివి చూశాం. కోడెల మృతికి పరోక్షంగా చంద్రబాబే కారణం. ఆయన పెట్టిన మానసిక వేధింపుల కారణంగానే కోడెల మరణించారు. ఉరేసుకున్నారని, గుండెపోటు వచ్చిందని అయన మరణంపై టీడీపీ నేతలే అనేక వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించిన తొలి వ్యక్తి చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్షన్‌ విపరీతంగా పెరిగింది. ఎన్నో హత్యలు చేయించారు. చెరుకుపాటి నారాయణరావును హత్య చేసింది టీడీపీ కాదా?. కోడెల మరణం పట్ల వైఎస్సార్‌సీపీ తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

చదవండి:


శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు

కోడెల మృతితో షాక్కు గురయ్యాను...

కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!

కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి

కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి

కోడెల మృతిపై కేసు నమోదు

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?

సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!

కోడెల శివప్రసాదరావు కన్నుమూత

>
మరిన్ని వార్తలు