అంజన్న సాక్షిగా టీటీడీ పరిధిలోకి గండి

29 Aug, 2019 08:02 IST|Sakshi
గండి ఆలయాన్ని టీటీడిలోకి విలీనం చేస్తున్నటు òఫైల్‌ను తీసుకుంటున్న టీటీడి అధికారులు

సుముహూర్తంలో సంతకాలు చేసిన అధికారులు

ఆలయ స్థిర చరాస్తులు, ఉద్యోగులు టీటీడీకి అప్పగింత

సాక్షి, చక్రాయపేట(కడప) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన మేరకు జిల్లాలోని గండి ఆలయం టీటీడీ పరిధిలో చేరింది.  రాయల సీమ జిల్లాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన చక్రాయపేట మండలం,మారెళ్ల మడక గ్రామం గండి క్షేత్రంలో వెలసిన శ్రీవీరాంజనేయ స్వామి ఆలయ బాధ్యతలను బుధవారం టీటీడి అధికారులకు గండి ఆలయ అధికారి అప్పగించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటలకు ముందుగా సిద్ధం చేసిన ఫైళ్లపై ఆలయ అధికారి పట్టెం గురుప్రసాద్‌ తొలి సంతకం చేయగా టీటీడీ డిప్యూటీæ ఈఓ గోవింద రాజన్‌ రెండవ సంతకం చేసి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆలయంతో పాటు గుడికి సంబందించిన స్థిర,చరాస్థులు,బంగారు,వెండితో పాటు ఇక్క డ పనిచేస్తున్న అందరు ఉద్యోగులను టీటీడీకి అప్పగిస్తున్నట్లు గురుప్రసాద్‌ ప్రక టించి సంబంధిత ఫైల్‌ను టీటీడీ డిప్యూటీ ఈవోకు అందజేశారు.ఆలయాన్ని టీటీడి వారికి అప్పగించే సమయానికి ఎఫ్‌డీలు,బ్యాంక్‌ అకౌంట్‌లతో కలపి రూ. 4,33,71,153  నగదు,సుమారు 900 గ్రాముల బంగారు,వంద కిలోల వెండితో పాటు సుమారు13 ఎకరాల భూమిని ఉన్నట్లు గురుప్రసాద్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు .ఇదంతా కూడా ఇకపై టీటీడీ వారి ఆధ్వర్యంలోనే ఉంటాయని వాటి బాధ్యత కూడా వారిదే నని చెప్పారు. టీటీడీ ఎస్టేట్‌ అధికారి విజయసారధి,సాధారణ పరిపాలనా విభాగం డిప్యూటీ ఈవో సుధారాణి,ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్,ఏవిఎస్‌వో పవన్‌ కుమార్‌తో పాటు రెవెన్యూ,జ్యువెలరి,హెల్‌త,విద్యుత్‌ తదితర శాఖలకు చెందిన అధికారులు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు.

ప్రభుత్వ జీఓపై హైకోర్టుస్టే: గండి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి అనే భక్తుడు జీవో రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.దీనిపై  కోర్టు జీవో రద్దు చేసింది. దీనిపై తాము నిర్ణయించుకున్న సమయం మేరకు ఉదయం 10 గంటలకే ఆలయాన్ని విలీనం చేసుకున్నామని అలాంటప్పుడు మధ్యలో జీవో రద్దు ఎలా చేస్తారని టీటీడీ∙తరపు న్యాయవాది వాదించడంతో స్టే వెకేట్‌ చేసుకొనేందుకు పిటీషన్‌ వేసుకోవాలని.. కేసును 30వ తేదీకి వాయిదా వేసింది.దీంతో టీటీడీ,దేవదాయ శాఖల అధికారులు కోర్టులో పిటీషన్‌ వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు