రోప్‌వే కోసం సర్వే

30 Jun, 2017 10:47 IST|Sakshi
రోప్‌వే కోసం సర్వే

► గండికోట వద్ద పరిశీలనలు
► రెండు çపద్ధ్దతుల్లో కోట అభివృద్ధికి సన్నాహాలు
► పర్యాటకశాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష


జమ్మలమడుగు: గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. గురువారం  ఏపీ టూరిజంశాఖకు చెందిన రీజినల్‌ డైరెక్టర్‌ గోపాల్, ఈఈ ఈశ్వరయ్య, డివిజనల్‌ మేనేజర్‌ ప్రసాద్‌రెడ్డి, ఏఈ పెంచలయ్య ముంబయికి చెందిన అమితుల్‌మిత అనే ప్రైవేట్‌ కన్సల్టెన్సీ సభ్యులతో కలిసి గండికోటను సందర్శించారు. ఇక్కడ రోప్‌వే ఏర్పాటు చేయటానికి అనువైన స్థలాలను గుర్తించడం కోసం   ప్రాథమిక సర్వే నిర్వహించారు.   గండికోటలోని జూమ్మామసీదు, మాధవరాయస్వామి ఆలయం,  గండికోట పైతట్టు ప్రాంతంలో ఉన్న  జలాశయం, పెన్నానది లోయ అటువైపు ఉన్న ఆగస్తీశ్వరకోన ప్రాంతాల్లోని  ప్రదేశాలను పరిశీలించారు.

వీటి గురించి కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. గండికోటను పబ్లిక్‌ ,ప్రవేట్‌ భాగస్వామ్యం, బిల్ట్‌ పద్ధతుల్లో   అభివృద్ధిచేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం గండికోటలో పర్యటించిన రోప్‌వే పరిశీలన బృందం నేరుగా కలెక్టర్‌ బాబారావునాయకుడుతో సమీక్షించారు. ఈసందర్భంగా  కలెక్టర్‌ రోప్‌ వే నిర్మాణానికి సంబంధించి పరిశీలన చేయాలన్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరిలో ఉన్న రోప్‌వేను ఎలా ఏర్పాటు చేశారనే విషయాన్ని ఆధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖలకు చెందిన అధికారుల సహకారంతో గండికోట అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడి  జూమ్మామసీదు, మాధవరాయ స్వామి ఆలయం, బందీఖానా, ఎర్రకోనేరుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు