గ్యాంగ్‌మన్ ఆత్మహత్య

16 Jun, 2014 01:01 IST|Sakshi
గ్యాంగ్‌మన్ ఆత్మహత్య

 సామర్లకోట :ఆర్థిక ఇబ్బందులు తాళలేక గ్యాంగ్‌మన్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. స్థానిక చంద్రంపాలెం లో రైల్వే గ్యాంగ్‌మన్ ఆదివారం రైలు కిందపడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల కథ నం ప్రకారం.. స్థానిక బలుసులపేటకు చెందిన పొన్నమల్ల కిష్టమ్మ (59) రైల్వేలో గ్యాంగ్‌మన్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారి వివాహాల కోసం అతడు అప్పులు చే శాడు. మొత్తం రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నా యి. వాటిని తీర్చాలని అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తున్నారు. ఇలాఉండగా కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురికావడంతో విధులకు సెలవు పెట్టాడు. ఈ క్రమంలో తునికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి న్యాయవాది ద్వారా నోటీసు ఇచ్చాడు. బకాయి చెల్లించకపోతే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించాడు.
 
 పదేళ్ల క్రితం సత్యనారాయణ వద్ద రూ.20 వేలు అప్పు తీసుకున్నామని కిష్టమ్మ భార్య లక్ష్మీకాంతం పేర్కొంది. సుమారు రూ.50 వేలు చెల్లించినా ఇంకా బాకీ ఉన్నట్టు నోటీసులో పేర్కొన్నారని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన కిష్టమ్మ  స్థానిక ఐదు తూములు దాటిన తర్వాత సామర్లకోట నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వచ్చే నెలలో తన భర్త పదవీ విరమణ చేయనుండగా, అప్పుల వారి వేధింపుల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని లక్ష్మీకాంతం రోదించింది. జామీదారుగా ఉండడం వల్ల కూడా అతడిపై అప్పులు పేరుకుపోయాయని విలపించింది. ఎస్సై గోవిందరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు