యువతి అనుమానాస్పద మృతి

5 Jan, 2016 03:40 IST|Sakshi
యువతి అనుమానాస్పద మృతి

►  గ్యాంగ్ రేప్.. ఆపై హత్యగా అనుమానాలు
►  భామినిలో సంచలనం
►  పోలీసు దర్యాప్తు ప్రారంభం
 ఘనసర కాలనీ (భామిని):
ప్రశాంతంగా ఉండే గ్రామంలో యువతి లైంగిక దాడి.. ఆపై హత్యకు గురైందనే వార్తతో భామిని మండలవాసులు ఉలిక్కి పడ్డారు. హతురాలు గ్రహణం మొర్రి బాధితులు కావడం గమనార్హం కాగా.. ఈ సంఘట స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. భామి ని మండలం ఘనసర కాలనీకి చెందిన 20 ఏళ్ల యువతి  సోమవారం కాలనీ సమీపంలోని పీఏసీఎస్ భవనం వెనుక వెదురు పొదల మధ్య అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆదివారం రాత్రి కాలనీ నుంచి బహిర్భూమికి వెళ్ళిన సుమతి ఎప్పటికీ రాకపోవడంతోస్థానికులు సమీపంలోని వరద కాలువ చుట్టూ గాలించారు. తెల్లవారే సరికి ఇంటికి సమీపంలోని వెదురు పొదల వద్ద  మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయారు.
 
 ఆ యువతి కాలనీ శివారులో పూరింట్లో ఉంటూ కుట్టుపని చేసుకుంటూ, వ్యాధి గ్రస్తురాలైన తల్లిని పోషించుకుంటూ కాలం వెలుబుచ్చుతోంది. గ్రహణం మొర్రి గల ఆమె అత్యాచారం, ఆపై హత్య(?)కు గురికావడం గ్రామస్తులకు ఓ పట్టాన మింగుడు పడడం లేదు. ఐదేళ్ల క్రితం తండ్రి  మృత్యువాత పడగా, తల్లి  కేన్సర్ వ్యాధితో మంచం పట్టింది. కూతురు మృత్యువాత పడిన విషయం తెలిసి ఆ తల్లి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఆదివారం రాత్రి ఎవరో పిలిస్తే తన కూతురు బయటకు వెళ్ళిందని ఆమె రోదిస్తూ చెబుతోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో బహిర్భూమికి వెళ్లిన మహిళలు యువతి మృతదేహాన్ని గుర్తించారు.
 
  మృతదేహం పడిన తీరు, ఒంటిపై దుస్తులు లేకుండా ఉండడాన్ని గుర్తించిన మహిళలు వెంటనే బట్టలు కప్పి గ్రామస్తులకు సమాచారం అందించారు. వీఆర్‌ఓ వి.చిన్నారావు సమాచారం మేరకు కొత్తూరు సిఐ కె.అశోక్ కుమార్, బత్తిలి ఎస్సై జి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని చేరుకొని అనుమానాస్పద మృతిగా గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రికి జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం సంఘటన స్థలంలో తనిఖీ చేపట్టింది.
 
 గ్యాంగ్ రేప్‌గా ప్రచారం
 ఘనసర కాలనీకి చెందిన మృతికి సామూహిక లైంగిక దాడి, ఆపై హత్యగా ఇక్కడ ప్రచారం జరుగుతోంది. మృత దేహం మెడలో గట్టిగా చుట్టిన చున్నీ ఉంది. ముఖం నిండా గాయాలు, రెండు చేతులు చాచినట్లు పడి ఉండడం, ఒంటిపై దుస్తులు తొలగించి  ఉండడాన్ని బట్టి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు దురాఘాతానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.
 
 హత్య కేసుగా నమోదు
 ఘనసర కాలనీ(భామిని): యువతి (20) అనుమానాస్పద మృతిని హత్య కేసుగా నమోదు చేసిన ట్లు శ్రీకాకుళం డీఎస్పీ రాంవర్మ స్పష్టంచేశారు. సోమవారం రాత్రి భామిని మండలం ఘనసర కాలనీ సమీపంలో సంఘటన స్థలాన్ని కొత్తూరు సీఐ అశోక్ కుమార్, బత్తిలి ఎస్సైతో కలిసి పరిశీలించారు. చుట్టుపక్కల ఇళ్లవారితో రహస్యంగా మాట్లాడి వివరాలు సేకరించారు. మృతురాలి తల్లిని పరామర్శించి, వివరాలు సేకరించారు.
 

మరిన్ని వార్తలు