గంగాధరం ఆస్తులు రూ.150 కోట్లు!

5 Apr, 2017 01:30 IST|Sakshi
గంగాధరం ఆస్తులు రూ.150 కోట్లు!

ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌

సాక్షి, విశాఖపట్నం:  ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌ గంగాధరం అక్రమాస్తుల కేసులో సోదా లు ముగిశాయి. ఈ నెల 1 నుంచి 4 వరకు జరిగిన దాడుల్లో వెలుగుచూసిన మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.11 కోట్లని అవినీతి నిరోధకశాఖ అధి కారులు తేల్చారు. వీటి మార్కెట్‌ విలువ రూ. 150 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ 25 బృందాలతో 16 ప్రాంతాల్లో దాడులు చేశామని, ఇంత వరకు ఏ అధికారి దగ్గరా దొరకనన్ని ఆస్తులు గంగాధరం, ఆయన కుటుంబసభ్యులు, స్నేహితుల వద్ద లభించాయని చెప్పారు. కుటుంబసభ్యులు, వియ్యంకుడు రామ సుబ్బారెడ్డి పేరుమీద రూ.90 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తాజాగా బయటపడ్డాయన్నారు.

రూ.20 లక్షలను షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని తెలిపారు. తొమ్మిది లాకర్లు గుర్తించామని, వీటిలో ఏడు హైదరాబాద్‌లో, రెండు విశాఖలో ఉన్నా యన్నారు. 4 కిలోల బంగారం, రూ.కోటికి పైగా నగదు, చిత్తూరు, నెల్లూరు, రంగారెడ్డి, విశాఖ జిల్లాల్లో 54 ఎకరాల భూములు, రాంకీ విల్లా, శ్వాన్‌లేక్, కూకట్‌పల్లిలో డూప్లెక్స్‌ హౌస్‌లతో కలిపి ఏడు ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు. సుప్రజలో రూ.2 కోట్లు, నమిత హోమ్స్‌లో రూ.1.3 కోట్లు, మరో ఐదు కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టారని వివరించారు. ఎస్‌ఎస్‌ ఫామ్స్, ఆర్‌ఆర్‌ ఫామ్స్, ఐమాజిక్స్‌ పొలారసిస్‌లలో రూ.24 లక్షల డిపాజిట్లున్నట్లు తెలిపారు.  ఆర్‌ అండ్‌ బి కాంట్రాక్టర్లు నాగభూషణం, విశ్వేశ్వరరావు, కిశోర్‌ ఇళ్లపై దాడులు చేశా మని, వారికి గంగాధరంతో ఉన్న సంబం ధాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు