ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ఘంటా రామారావు

3 Dec, 2018 04:56 IST|Sakshi
రామారావు , రామజోగేశ్వరరావు

ఉపాధ్యక్షుడిగా రామజోగేశ్వరరావు 

బీసీఐ సభ్యుడిగా ఆలూరు రామిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా సీనియర్‌ న్యాయవాది ఘంటా రామారావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కె.రామజోగేశ్వరరావు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ)లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ప్రతినిధిగా ఆలూరు రామిరెడ్డి విజయం సాధించారు. బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ పోస్టుకు చివరి వరకూ కృష్ణారెడ్డి, ఘంటా రామారావులు  పోటీపడ్డారు. మొత్తం 26 ఓట్లకుగాను కృష్ణారెడ్డికి 11 ఓట్లు రాగా, ఘంటా రామారావుకు 15 ఓట్లు వచ్చాయి. దీంతో ఘంటా రామారావు ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఇక వైస్‌ చైర్మన్‌గా  రామజోగేశ్వరరావు టాస్‌లో నెగ్గారు. మొదటి రెండున్నర ఏళ్లు రామజోగేశ్వరరావు, మిగిలిన రెండున్నర ఏళ్లు పోటీపడిన కృష్ణమోహన్‌ వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బీసీఐలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ ప్రతినిధి పోస్టుకు సీనియర్‌ సభ్యులు ఆలూరు రామిరెడ్డి, కలిగినీడి చిదంబరం పోటీపడ్డారు. రామిరెడ్డికి 16 ఓట్లు రాగా, చిదంబరం 10 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు