నిగ్గదీసిన నేరానికి పీఈటీ ‘ఔట్’!

28 Jan, 2014 00:37 IST|Sakshi
నిగ్గదీసిన నేరానికి పీఈటీ ‘ఔట్’!
  • గంటాతో తంటా?
  •  ‘గ్రేటర్’ విద్యాశాఖలో రాజకీయ జోక్యం
  •  ఢీఅన్న డ్రిల్ మాస్టారికి స్థాన చలనం
  •  
    అనకాపల్లి, న్యూస్‌లైన్: సాధారణంగా పాఠశాల విద్యార్థులను పీఈటీలు ఆటలాడిస్తారు. ఔట్లు ప్రకటిస్తారు. కాని అనకాపల్లిలో రాజకీయ నాయకులు పీఈటీలతో ఆటలాడుకుంటూ వారిని ఔట్ చేస్తున్నారు. వినడానికి ఆసక్తిగా ఉన్నా విద్యారంగంపై రాజకీయ నాయకులు చేస్తున్న పెత్తందారీ తనానికి ఈ సంఘటనలు అద్దం పడతాయి. కేవలం తోటి ఉద్యోగుల జీతాల కోసం మంత్రిని నిలదీసినందుకు, గతంలో తోటి ఉపాధ్యాయుల విధి నిర్వహణ తీరుపై ప్రశ్నించినందుకు అనకాపల్లి పీఈటీతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న మునిసిపల్ అధికారుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
     
    గ్రేటర్‌కు తరిమిన తీరిదీ..
     
    గ్రేటర్ విశాఖలోకి అనకాపల్లి పట్టణాన్ని విలీ నం చేయడంతో ఉద్యోగులకు ఆరు నెలల నుం చి జీతాలు సరిగ్గా అందలేదు. సాంకేతిక త ప్పిదాలకు తోడు అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం ఇన్నాళ్లు కనిపిస్తే, దాని ని ప్రశ్నించినందుకు గాంధీనగరంలో పీఈటీగా వ్యవరిస్తున్న పైసా మాస్టార్‌ను గ్రేటర్ విశాఖకు తరిమేశారు. పరి పాలనా సౌలభ్యం కోసమంటూ అధికారులు కుంటుసాకులు చూపుతున్నా ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమం కారణంగానే ఆయనను బ దిలీ చేశారన్నది సర్వ విదితం.

    మంత్రి హోదా లో మునిసిపల్ కార్యాలయానికి విచ్చేసిన గంటా శ్రీనివాసరావును జీతాల బకాయిల కోసం ఉపాధ్యాయులు నిలదీయగా ఉపాధ్యాయులకు నాయకత్వం వహించారు పైసా మాస్టార్. తమకు సమాధానం చెప్పాలని మంత్రిని డిమాండ్ చేస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయిన మంత్రి పోలీసులతో అరెస్టు చేయించాలని ప్రయత్నించడం కొసమెరుపు.  ఇదిలావుండగా బదిలీలు అవసరంలేని ప్రస్తుత సమయంలో పైసా మాస్టార్‌ను విశాఖపట్నానికి పంపించడం ద్వారా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్నారని స్పష్టమవుతోంది.

    గతంలోనూ పీఈటీ పైసా మాస్టార్‌ను లక్ష్యంగా చేసుకొని ఒక కమిషనర్ కేసులు పెట్టించడం గమనార్హం. 2011లో మునిసిపల్ మెయిన్ హైస్కూల్ పీఈటీగాను, స్టేడియం ఇన్‌ఛార్జిగాను పనిచేసిన పైసా మాస్టార్‌ను అప్పట్లో రాజకీయ వత్తిళ్లతో గాంధీనగరం హైస్కూల్ శెలవుల సమయంలోబదిలీ చేశారు. పైసా మాస్టార్ కంటే జూనియర్‌కు స్టేడియం ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి పీఈటీలలో విభజించే పాలనకు తెరలేపారు ఈపాలకులు.
     

మరిన్ని వార్తలు