మల్టీనేషనల్‌ కంపెనీలా డీజీపీ ఆఫీస్‌: గంటా

16 Oct, 2017 13:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం అక్టోబర్ 21న కూడా పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామని, విధుల్లో భాగంగా మరణించిన పోలీసులకు ఆరోజు నివాళ్లు అర్పిస్తామని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్టేషన‍్లకు పౌరులను పిలిచి వారికి ఆయుధాలపై అవగాహన  కల్పిస్తామని చెప్పారు. ఇకపై ఇంట్లో ఉన్నా లేకపోయినా వారి కుటుంబానికి పోలీస్ నుంచి భరోసా కల్పిస్తామన్నారు.

ఏడాది స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాకు పది స్కూళ్లని దత్తత తీసుకొని వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను తొలిసారి అమరావతిలోని డీజీపీ కార్యాలయానికి వచ్చానని, అచ్చం చూడడానికి మల్టీనేషనల్ కంపెనీలా అద్భుతంగా ఉందన్నారు. విద్యకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఆంద్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి అని, రాష్ట్రంలో 860 పోలీస్ స్టేషనలు ఉన్నాయని, పోలీస్ స్టేషన్ కి ఒకటి చొప్పున దత్తత తీసుకోవటంపై డీజీపీని, పోలీసులను ప్రభుత్వం అభినందిస్తున్నదన్నారు. విద్యార్థుల ఆత్మహత్యపై ఈ రోజు ప్రేవేట్ స్కూల్, కాలేజీ యాజమాన్యాలతో, విద్యార్థి సంఘాలతో సీఎం సమావేశం కానున్నారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులుపై ఒత్తిడి తీసుకురాకుండా చదివించాలని కోరుతున్నామన్నారు.

మరిన్ని వార్తలు