మాకు గ్యాస్ ఇప్పించండి: పీపీఏ బృందం

8 Jul, 2014 03:28 IST|Sakshi
మాకు గ్యాస్ ఇప్పించండి: పీపీఏ బృందం

హైదరాబాద్: నిరుపయోగంగా ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ ఇప్పించాలని ఏపీ సీఎం చంద్రబాబుతో విద్యుత్ ఉత్పత్తిదారుల అసోసియేషన్ (పీపీఏ) కోరింది. అసోసియేషన్ డెరైక్టర్ జనరల్ అశోక్ ఖురానా నేతృత్వంలో అనిల్ అంబానీ, ల్యాంకో మధుసూదన్, జీవీకే రెడ్డి తదితరులు సోమవారం లేక్ వ్యూలో బాబుతో సమావేశమయ్యారు. రాష్ర్టంలో ఏడు వేల మెగావాట్ల గ్యాస్ ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయని... త్వరలో ఓఎన్‌జీసీ ఉత్పత్తి చేయనున్న రోజుకు 6 మిలియన్ మెట్రిక్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ (ఎంఎంసీఎండీ)లో వాటా వచ్చేలా చూడాలని కోరారు. ఎల్‌ఎన్‌జీ యూనిట్‌తో పాటు ఫ్లోటింగ్ స్టోరేజీ అండ్ రీ-గ్యాసిఫికేషన్ యూనిట్ (ఎఫ్‌ఎస్‌ఆర్‌యూ) ఏర్పాటు చేసేందుకూ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇందుకు బాబు సానుకూలంగా స్పందించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి గ్యాస్ సరఫరా కోసం అసోసియేషన్ కలిసినప్పటికీ... సమావేశం అనంతరం చంద్రబాబుతో అనిల్ అంబానీ పది నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమై నెల్లూరు జిల్లాలోని రిలయన్స్ ప్లాంటు విద్యుత్ ధరను పెంచేందుకు సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు