ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్‌ లీక్‌

4 Feb, 2020 10:59 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో గ్యాస్‌ లీకేజ్‌ అదుపులోకి వచ్చింది. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మంగళవారం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతమయింది. మడ్‌ పంపింగ్‌ ద్వారా ముంబై నుంచి వచ్చిన స్పెషల్‌ టీమ్‌ గ్యాస్‌ బ్లో అవుట్‌ను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఉప్పూడి పరిసరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రెండు రోజులుగా ఉప్పూడి సమీపంలోని ప్రజలను గ్యాస్‌ బ్లో అవుట్‌ వణికించిన సంగతి తెలిసిందే. దీనిని అదుపు చేసేందుకు సోమవారం ఓఎన్‌జీసీ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

దీంతో ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రెస్క్యూ మంగళవారం ఆపరేషన్‌ కొనసాగించారు. గ్యాస్‌ లీక్‌ను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. 2.2 కి.మీల లోతులో ఉన్న గ్యాస్‌ బావిలోకి నిరంతారాయంగా వాటర్‌ పంపింగ్‌ చేపట్టారు. చివరకు మడ్‌పంపింగ్‌ ద్వారా గంటన్నలోపే గ్యాస్‌ లీకేజ్‌ను అదుపులోని తెచ్చారు. అంతకుముందు గ్యాస్‌ లీకేజీ దృష్ట్యా ఘటన స్థలికి 2 కి.మీ పరిధిలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. కాట్రేనికోనలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

మరిన్ని వార్తలు