గ్యాస్‌కు, రేషన్‌కు ఆధార్‌తో ముడిపెట్టొద్దు

28 Sep, 2014 01:38 IST|Sakshi
  • అధికారులకు మంత్రి సునీత  ఆదేశం
  • విశాఖపట్నం :  గ్యాస్‌కు, రేషన్‌కు ఆధార్‌తో ముడిపెట్టొద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎప్పటిలాగే ఈ రెండు నిత్యావసరాలను వినియోగదారులకు అందించాలని పౌరసరఫరాల అధికా రులను ఆదేశించారు.  నగరంలోని సిరిపురం జంక్షన్‌లో గల వాల్తేర్ అప్‌లేండ్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    ఆధార్‌ను దేనికీ అనుసంధానం చేసేలా ప్రభుత్వం ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదని మంత్రి  స్పష్టం చేశారు. బోగస్‌కార్డులు, బోగస్ పెన్షన్లు వెలికితీయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా ప్రతి ఒక్కరికీ ఆధార్‌కార్డు ఉండాలన్నదే  ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

    పట్టణప్రాంతాల్లో ఆధార్ నమోదు సంతృప్తికరంగా ఉన్నా, గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో నమోదు మందకొడిగా ఉండటంపై  ఆమె విచారం వ్యక్తం చేశారు.  ఆధార్ నమెదు తక్కువగా ఉన్న గ్రామాలకు అవసరమైతే మొబైల్ వాహనాలను పంపించి అరందరికీ ఆధార్ నమోదయ్యేలా  చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు