గౌతమిది హత్యే

9 May, 2018 10:37 IST|Sakshi

చీరాల రూరల్‌: భర్త, అత్త మామల వేధింపుల కారణంగానే గౌతమి సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె మృతికి కారణమైన భర్తను అరెస్టు చేసినట్లు డీఎస్పీ డాక్టర్‌ ప్రేమ్‌ కాజల్‌ తెలిపారు. మంగళవారం ఆమె స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చీరాల పట్టణం కొట్లబజారు రామ మందిరం వీధికి చెందిన కోట పాండురంగారావు కుమారుడు కోట వెంకట రామకృష్ణ మణికంఠ పవన్‌కుమార్‌ అలియాస్‌ మణికంఠతో గుంటూరుకు చెందిన గాదుమల్ల వెంకట రత్నం కుమారై గౌతమికి 2014లో వివాహం జరిగింది. 

ఆ తర్వాత మణికంఠ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి చీరాలలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఇది గౌతమికి నచ్చలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. గౌతమి పుట్టింటి వారు విక్రయించిన ఆస్తులకు సంబంధించి వాటా తీసుకురాకపోవడంతో భర్త, అత్తమామలు ఆమెను ఇబ్బంది పెట్టారు. వారి బాధలు భరించలేని గౌతమి గత నెల 26వ తేదీ ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో ముగిని ఆత్మహత్యకు పాల్పడింది.

 గౌతమి మృతికి ఆమె భర్త, అత్త మామలే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పాండురంగారావు, పుష్ప అమృతవల్లిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన ఆమె భర్తను అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ కేసులో మిగిలిన నిందితులైన మణికంఠ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, ఈపురుపాలెం ఎస్‌ఐ అనూక్‌ న్నారు. 

మరిన్ని వార్తలు