శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం

22 Feb, 2017 03:53 IST|Sakshi
శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం

చీరాల: శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగ సిద్ధమైంది. మహాశివరాత్రి రోజున ఈ తలపాగా చుట్టిన తర్వాతే మల్లికార్జున స్వామికి భ్రమరాంబతో పెళ్లి తంతు మొదలవుతుంది. పరమశివుణ్ని పెళ్లి కుమారుడిగా అలంకరించే వస్త్రాన్ని ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి హస్తినాపురంలోని ఓ చేనేత కుటుంబం నేస్తుంది. ఇక్కడి పృథ్వీ వంశస్థులు వందేళ్లకు ముందు నుంచి ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ఏటా మహా శివరాత్రిన జరిగే శ్రీశైలం మల్లన్న కల్యాణోత్సవంలో శివుణ్ని వరుడిగా అలంకరణ చేస్తారు. 150 గజాలు ఉండే ఈ వస్త్రాన్ని ఆలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చుడతారు.

కల్యాణం అనంతరం ఈ వస్త్రాన్ని వేలంలో దక్కిం చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సైతం పోటీపడతారు. ఈ తలపాగాతో మం గళవారం ఉదయం పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఊరేగింపుగా శ్రీశైలం బయల్దేరింది. తాను నేసిన బట్టతో పరమశివుణ్ని వరుడిగా అలంకరించడం తన అదృష్టమని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాగా, మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవానికి ఏపీ ప్రభుత్వం తరపున ఆర్‌అండ్‌ బి, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతు లు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు.

మరిన్ని వార్తలు