చదివింది బీఎస్సీ కంప్యూటర్స్‌..చోరీల్లో ఎక్స్‌పర్ట్‌

1 Jan, 2019 10:10 IST|Sakshi

ఘరానా దొంగ అరెస్ట్‌

రూ.4.53 లక్షల విలువ చేసే 151 గ్రాముల బంగారు స్వాధీనం 

తిరుపతి క్రైం : తిరుపతి నగరంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగను క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి కథనం మేరకు.. వైఎస్సార్‌ జిల్లా రాయచోటి, కొత్తపేటకు చెందిన వెంకటస్వామి కుమారుడు దారూరిరెడ్డి సతీష్‌ (33)ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఇతను శ్రీనివాసం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో క్రైం సీఐ పద్మలత అరెస్ట్‌ చేశారు. ఇతని నుంచి రూ.4.53 లక్షలు విలువ చేసే 151 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసి, పలు ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసినట్లు తేలింది. జీతం తక్కువని ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి దొంగగా అవతారం ఎత్తాడు. తాళాలు వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడి వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు.

మరిన్ని వార్తలు