కత్రియ హోటల్ను సీజ్ చేసిన అధికారులు

9 Jan, 2014 14:09 IST|Sakshi

హైదరాబాద్ : సోమాజిగూడలోని కత్రియ హోటల్ను గురువారం  హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. గత మూడేళ్లుగా ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో అధికారులు ఈ మేరకు చర్య తీసుకున్నారు.  కార్పొరేషన్‌కు పన్ను చెల్లించకపోడవంతో పలుసార్లు నోటీసులు జారీ చేశామని, అయినప్పటికీ బకాయిలు చెల్లించకపోవటంతో హోటల్ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ బకాయిలు చెల్లించాలంటూ హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.

మరిన్ని వార్తలు