ఉపాధి హామీలో ఏపీ నంబర్‌వన్‌..

13 Jul, 2020 16:38 IST|Sakshi

కరోనా కాలంలో రూ.4 వేల కోట్ల వేతనాలు చెల్లింపు

పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌

సాక్షి, విజయవాడ: ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌వన్‌గా నిలిచిందని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పని కల్పించామని, కరోనా కష్టకాలంలో అత్యధికంగా ఉపాధి కల్పించగలిగామని ఆయన వెల్లడించారు. (కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ సమీక్ష)

‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టార్గెట్ మేరకు 57 లక్షల మంది కూలీలకు పని కల్పించాం. జూన్ ఒక్క నెలలోనే అత్యధికంగా 8 కోట్ల పని దినాలు కల్పించాం. కరోనా కాలంలో పని కల్పించి రూ.4 వేల కోట్ల వేతనాలు చెల్లించామని’’  ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్ క్లినిక్‌లు, నాడు - నేడు పాఠశాలల పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆస్తుల నిర్మాణంలోనూ దేశంలోనే ఏపీని నంబర్‌వన్‌ స్థానంలో నిలిపామని, పారదర్శకంగా వేతనాల చెల్లింపుల్లోనూ అందరికంటే ముందజలో ఉన్నామని గిరిజా శంకర్‌ వెల్లడించారు. (‘గిరిజనులకు మెరుగైన వైద్యమే లక్ష్యం’)

మరిన్ని వార్తలు