ఈ చిట్టితల్లికి ఎంత కష్టం..

21 Dec, 2017 09:09 IST|Sakshi
చిన్నారితో తల్లిదండ్రులు

కాలేయం పాడైన ఎనిమిదేళ్ల చిన్నారి

బెంగళూరు వైదేహీలో చికిత్స

లివర్‌ మార్చాలంటున్న వైద్యులు

అపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

చిత్తూరు, పలమనేరు: లక్ష్మి ఎనిమిదేళ్ల చిన్నారి..పలమనేరు లిటిల్‌ ఏంజెల్స్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. తోటి పిల్లలతో చలాకీగా కనిపించే లక్ష్మికి అనుకోని జబ్బు వచ్చి పడింది. బిడ్డకు కాలేయం పాడైందని తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుంగిపోయారు. బిడ్డను బతికించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు పేదరికం శాపంలా మారింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన శివప్రసాద్‌ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పది రోజుల క్రితం కుమార్తె లక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు.

పరీక్షించిన వైద్యులు లివర్‌ సంబంధిత వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. వారి సూచన మేరకు ఈనెల 12న బెంగళూరులోని వైదేహీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని వైద్యులు సూచించారు. పేద కుటుంబం కావడంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారు కొంత సాయం చేశారు. సోషల్‌ మీడియా సాయంతో మరికొంత వచ్చింది. ఆపరేషన్‌కు రూ.15లక్షల దాకా అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లి దండ్రులు మంత్రి అమరనాథరెడ్డికి విన్నవిం చారు. అంతమొత్తంలో సాయం చేయలేమని ఆయన చెప్పడంతో మరింత నిరాశకు గురయ్యారు. దాతలు ఎవరైనా ఉంటే 94940 66812, 9642951204లను సంప్రదించాలని కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు