బాలిక నిశ్చితార్థాన్ని అడ్డుకున్న అధికారులు

23 Jul, 2015 01:10 IST|Sakshi

మద్దూరు (కంకిపాడు) : బాలిక నిశ్చితార్థం సన్నాహాలను ఐసీడీఎస్, పోలీసు శాఖ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని మద్దూరు గ్రామంలో బుధవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గోపి రాజు మైనర్‌తో వివాహం చేసేందుకు పెద్దలు ఒప్పందం చేసుకున్నారు. గురువారం నిశ్చితార్థ వేడుక పెట్టుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విషయాన్ని స్థానికు లు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఐసీడీఎస్ అధికారులు, పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

మేజర్లు కాకుండా వివాహం జరిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇరుపక్షాల పెద్దలను హెచ్చరించారు. తరచూ నిర్వహించే తనిఖీల్లో మైనర్లు అందుబాటులో లేకపోతే శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయాల్సి ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో ఉమాదేవి హెచ్చరించారు. మైనార్టీ తీరే వరకూ వివాహం జరిపించబోమని స్పష్టంచేస్తూ ఇరుపక్షాల పెద్దలతో రాతపూర్వక హామీ తీసుకున్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మాదేవి పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు