శివ.. శివా!

26 Feb, 2017 22:41 IST|Sakshi
శివ.. శివా!

రావివలస మల్లన్న తిరువీధి ఉత్సవంలో అశ్లీల నృత్యాలు
విస్మయానికి గురైన భక్తులు    


రావివలస(టెక్కలి): కలియుగ కైలాసంగా పేరుగాంచిన టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జున స్వామి తిరువీధి ఉత్సవానికి నిర్వాహకులు అపఖ్యాతి తె చ్చారు. తిరువీధి ఉత్సవంలో అశ్లీల నృ త్యాలు ఏర్పాటు చేయడంతో భక్తులు వి స్మయానికి గురయ్యారు. దేవస్థానం అధికారుల తీరుపై మండిపడ్డారు. మహాశివరాత్రిని పురష్కరించుకుని భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామికి శనివారం రాత్రి గ్రామంలో తిరువీధి ఉత్సవం నిర్వహించారు.

దేవస్థానం ఈఓ జి.గురునాథరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో ఒడిశా ప్రాంతానికి చెందిన కళాకారుల బృందం చేసిన ధూం ధడక్‌ నృత్యాలు అశ్లీలంగా ఉండడంతో భక్తులు విస్మయానికి గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి అశ్లీల కార్యక్రమాలు నిర్వహించడంపై మండిపడ్డారు.

కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ ఎల్‌.ఎల్‌.నాయుడు, సంతబొమ్మాళి జెడ్పీటీసీ ఎల్‌.లక్ష్మీతో పాటు అర్చకులు రామకృష్ణ, మోహన్, యుగంధర్‌ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారుల సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమంపై స్థానికులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మరిన్ని వార్తలు