గీతం యూనివర్సిటీలో ప్రవేశాలు

14 Nov, 2019 13:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ శివరామకృష్ణ పూర్తి షెడ్యూల్‌ను వివరించారు. వచ్చే ఏడాది ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో గ్యాట్‌-2020(గీతం అడ్మిషన్‌ టెస్ట్‌) ద్వారా అడ్మిషన్లు చేపడతామని వెల్లడించారు. ఏప్రిల్‌ 11 నుంచి 21 వరకు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 50 కేంద్రాలను కేటాయించారు. ఏప్రిల్‌ 25న ఫలితాలు ప్రకటించనున్నారు. యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచెస్లో దరఖాస్తులు లభ్యమవుతాయని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు www.gitam.edu వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈ సంవత్సరం నూతనంగా ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కోర్సు, మెషీన్‌ లెర్నింగ్‌ను, ఎంటెక్‌లో స్ట్రక్చరల్‌ ఎనాలసిస్‌ అండ్‌ డిజైన్‌, విత్‌ డాటా సైన్స్‌ కోర్సు, మానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అనాలసిస్‌ కోర్సులు కొత్తగా ప్రవేశపెడుతున్నారు. రూ. 30 కోట్లతో ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. గ్యాట్‌- 2020లో మెదటి 50 ర్యాంకుల్లోపు వారికి ఉచిత విద్య, 51-250 ర్యాంకు వారికి ఫీజులో 75శాతం రాయితీ, 251-1000 వరకు ర్యాంకర్లకు 50 శాతం రాయితీ, 1001-3000 ర్యాంకు వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా శివరామకృష్ణ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు