25 సెంట్లు ఆలయ అభివృద్ధికి ఇవ్వండి

14 May, 2015 01:39 IST|Sakshi
25 సెంట్లు ఆలయ అభివృద్ధికి ఇవ్వండి

దుర్గగుడి అధికారుల విన్నపం
గోశాల యాజమాన్యం తాత్సారం

 
విజయవాడ : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న దుర్గగుడి అభివృద్ధికి గోశాల అడ్డంకిగా మారింది. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రాజగోపురం, మల్లికార్జున మహామండపాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి  తెలిసిందే. వీటిని భక్తులకు అందుబాటులోకి తేవాలంటే అర్జున వీధిని అభివృద్ధి చేయాలి. ఇందుకు గోశాల నుంచి కొంత స్థలం సేకరించాల్సి ఉంది. ఆ స్థలం కేటాయించాలంటూ  దేవస్థానం అధికారులు మూడేళ్లుగా అడుగుతున్నప్పటికీ ఇవ్వకుండా గోశాల నిర్వాహకులు తాత్సారం చేస్తున్నారు.
 కొలిక్కిరాని చర్చలు

అర్జున వీధిని అభివృద్ధి చేయడంతో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న రాజగోపురానికి చేరుకోవడానికి మల్లికార్జున మహామండపానికి ర్యాంపులు వేయాలి. లేదంటే స్పీడ్ లిఫ్టులు ఏర్పాటుచేయాల్సి ఉంది. దీనికి గోశాలకు చెందిన 25 సెంట్ల స్థలం అవసరం అవుతుంది. దీని కోసం దేవస్థానం అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా గోశాల నిర్వాహకులతో చర్చలు జరిపారు. ఇంకా ఒక కొలిక్కి రాలేదు. గోశాలకు చెందిన స్థలం ఇస్తే ప్రస్తుతం ఉన్న భూమి రేటు కంటే  రెట్టింపు  ఇస్తామని దేవస్థానం అధికారులు సూచించారు.
 
గోసంరక్షణ సంఘం మెలిక..

గోశాల 78 సెంట్ల భూమిలో ఉంది.  28 సెంట్లు గోశాలకు చెందినది. వెనుకవైపు ఉన్న 50 సెంట్లు ఇరిగేషన్ శాఖది. దుర్గగుడి మెట్ల మార్గం వైపు ఉన్న 28 సెంట్ల స్థలాన్ని దేవస్థానానికి ఇస్తే.. ఇరిగేషన్ స్థలం తమకు ఇప్పించాలని అప్పట్లో గోశాల నిర్వాహకులు కోరారు. దీనికి అంగీకరించిన అప్పటి కలెక్టర్ నవీన్‌మిట్టల్, ఈవో చంద్రకుమార్‌తో పాటు పలువురు అధికారులు గోశాల యాజమాన్యంతో ఒక ఒప్పం దానికి వచ్చారు. దీని ప్రకారం ఇరిగేషన్ స్థలాన్ని గోశాలకు ఇప్పించాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు  ఈ స్థలం బదలాయింపు జరగలేదు. ఇప్పుడు దుర్గగుడి అభివృద్ధి కోసం గోశాలకు చెందిన 28 సెంట్ల స్థలాన్ని ఇచ్చేస్తే ఆవులకు అసలు స్థలం ఉండదని, గోశాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని నిర్వాహకులు అంటున్నారు. 

ఆర్థికపరమైన విషయాలను పక్కనపెట్టి ఇరిగేషన్ స్థలం తమకు బదిలీ చేస్తే దేవస్థానానికి స్థలం తక్షణం ఇస్తామని గోశాల ప్రతినిధులు చెబుతున్నారు. గోశాల స్థలాన్ని బలవంతంగా తీసుకుంటే గోప్రేమికుల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు నిర్వాహకుల్ని ఒప్పించి  తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. గోశాల తరలిపోకుండా ఉండాలంటే ఇరిగేషన్ స్థలం ఇప్పించడి
 
 

మరిన్ని వార్తలు