కిడ్నీ బాధితులపై సమగ్ర నివేదిక ఇవ్వండి

25 May, 2017 01:51 IST|Sakshi
కిడ్నీ బాధితులపై సమగ్ర నివేదిక ఇవ్వండి

రాష్ట్ర సర్కారుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

సాక్షి, అమరావతి:
శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లో కిడ్నీ జబ్బుల తీవ్రత, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందకపోవడానికి గల కారణాలపై ఈ నెల 31వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘వేలాది మంది కిడ్నీ జబ్బులకు గురవుతున్నారు. వీళ్లకు సరైన చికిత్స అందడం లేదు. దీనికి కారణాలనూ చెప్పడం లేదు’ అనే అంశాలతో పత్రికల్లో వచ్చిన కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించి ఈ ఆదేశాలు జారీ చేసింది.

శ్రీకాకుళం జిల్లా ఉద్దాపురం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లో మూత్రపిండాల జబ్బులు తీవ్రంగా ఉన్నాయి. ఈ మండలాల్లో సుమారు 16 వేల మంది తీవ్రమైన కిడ్నీ జబ్బుల (క్రానిక్‌ కిడ్నీ డిసీజెస్‌)తో బాధపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి   నివేదిక ఎలా ఇవ్వాలని సర్కారు పెద్దలు, అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

మరిన్ని వార్తలు