17,500కోట్ల విదేశీ అప్పునకు చాన్సివ్వండి

6 Nov, 2016 02:21 IST|Sakshi
17,500కోట్ల విదేశీ అప్పునకు చాన్సివ్వండి

కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

 సాక్షి, హైదరాబాద్:  కేంద్ర సాయం కింద ఏడాదికి రూ.3,500 కోట్ల చొప్పున వచ్చే ఐదేళ్లలో రూ.17,500 కోట్ల మేర విదేశీ అప్పునకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అంతేగాక కేంద్ర సాయంతో నిమిత్తం లేకుండా నూటికి నూరు శాతం రాష్ట్రప్రభుత్వమే తీర్చుకునేలా మరో రూ.21,034 కోట్ల విలువగల ప్రాజెక్టులకోసం విదేశీ అప్పునకు అనుమతించాలని విన్నవించింది.

మొత్తం రూ.32,573 కోట్ల మేర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పు పొందేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు అనుమతించాలని కోరింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు రెండు రోజులక్రితం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలోనే సీఎం ఈ లేఖ రాశారు.

మరిన్ని వార్తలు