నిధుల దోపిడీకి పచ్చజెండా?

19 Feb, 2018 13:02 IST|Sakshi
కుప్పం ఉపకాలువ

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులకు అదనంగా రూ.160కోట్లు  

చెల్లింపునకు సమగ్ర వివరాలు కోరిన ఆర్థికశాఖ

టీడీపీ కాంట్రాక్టర్ల కోసం జీఓ జారీచేసే అవకాశాలు?  

బి.కొత్తకోట: జిల్లాలో 2005 నుంచి 2009 వరకు హంద్రీ–నీవా సహా మిగిలిన ప్రాజెక్టుల పనులు చేపట్టి పూర్తిచేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్లకు అదనపు నిధులు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులను ఇటీవల జారీ చేసింది.  2014 తర్వాత నుంచి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు వర్తించదు. అయినప్పటికీ టీడీపీ కాంట్రాక్టర్ల ఒత్తిళ్లతో అందినంత దోచుకునేందుకు రంగం సిద్ధమవుతోం ది. దీనికి అవినీతి ముద్ర లేకుండా, అనుకూలమైన ఒకరిద్దరు టీడీపీ కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ధి్ద కలిగేలా జీఓ జారీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది.  ఇందులో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు అప్పనంగా రూ.160కోట్ల ప్రభుత్వ నిధులు దోచి పెట్టేందుకు పక్కా ప్రణాళిక సాగుతోంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు తరలించే కుప్పం ఉపకాలువ పనులను 4శాతం అదనంతో రూ.430.27 కోట్లకు హెఈఎస్, ఆర్‌కే, కోయా జాయింట్‌ వెంచర్‌ పనులు దక్కించుకోగా ఈ సంస్థల వినతిమేరకు ప్రభుత్వం రిత్విక్‌ ప్రాజెక్ట్స్, మరో కాంట్రాక్టు సంస్థను పనుల్లో భాగస్వామ్యం కల్పించింది.

కాంట్రాక్టర్లు ప్రభుత్వం ముందుగా తెలిపిన పనుల అంచనా వ్యయాన్ని తెలిపింది. దీనిని పరిశీలించాకే కాంట్రాక్టు సంస్థలు పనులు దక్కిం చుకొన్నాయి. నిబంధనల మేరకు ప్రతిపాదిత పనులు పూర్తి చేయాల్సిన సంస్థలు తమకు అనుకూలంగా పనులు చేశాయి. కాలువ దూరం తగ్గించడం, కొత్తగా పనులను చేర్చుకొంటూ వచ్చా యి. నిబంధనల మేరకు నిర్ణయించిన అంచనాకు పనులు పూర్తిచేసి ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాకర్లది. ఇక్కడ మాత్రం పనులు అనుకూలంగా చేసుకోవడంతో పాటు అదనపు భారం పడిందంటూ రూ.160కోట్లు చెల్లించాలని మెలిక పెట్టా రు. ఈ విషయాన్ని మదనపల్లె సర్కిల్‌ అధికారులు చీఫ్‌ ఇంజినీర్ల కమిటీకి నివేదించారు. అదనపు చెల్లింపులకు సంబం ధించిన వివరాలతో కమిటీ ఆర్థికశాఖకు నివేదిక పంపింది. ఆర్థికశాఖ ఈ నివేదికను మూడురోజుల క్రితం చీఫ్‌ ఇంజనీర్ల కమిటీకి తిప్పిపంపినట్టు సమాచారం.

కుప్పం కోసమే?
చీఫ్‌ ఇంజినీర్ల కమిటీ ప్రతిపాదనలో కుప్పం కాలువకు అదనంగా రూ.160 కోట్ల చెల్లింపుల ప్రస్తావన లేకుండానే 2014 తర్వాత పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా జీఓ 22,63 తరహాలో కొంత ప్రయోజనం కలిగించాలని మరో ప్రతిపాదనను మళ్లీ ఆర్థికశాఖకు పంపింది. ఈ శాఖ కాంట్రాక్టర్లకు అదనపు ధరలు ఎందుకు చెల్లించాలి, అందుకు కారణాలు, వివరాలను సమగ్రంగా నివేదిం చాలని చీఫ్‌ ఇంజనీర్ల కమిటికి నివేదిం చిందినట్టు తెలిసింది. దీనికి చీఫ్‌ ఇంజనీర్ల కమిటి నిర్ణయం, చెల్లింపులకు అనుకూలంగా ఎలాంటి ప్రతిపాదన అందిస్తుం దో తేలాలి.  కుప్పం ఉపకాలువతోపాటు టీడీపీ ముఖ్యనేతలు చేపట్టిన పనులకు సంబంధించిన కొన్నింటికి మాత్రమే ఈ అదనపు నిధులు అందే విధంగా జీఓ జారీచేసే అవకాశాలు లేకపోలేదని భావి స్తున్నారు. కాంట్రాక్టర్లందరికీ వర్తించకుండా తమ కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులందించేలా నిబంధనలు సవరించి  చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుప్పం కాలువ పనులు పూర్తిగా ఆగిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పనులు చేయించేందుకు భయపడుతున్నారు. టీడీపీ ముఖ్యనేత ఒకరు ఈ పనుల్లో భాగస్వామిగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు