రీయింబర్‌‌సమెంట్ నిధులు స్వాహా

29 Jan, 2015 02:53 IST|Sakshi
రీయింబర్‌‌సమెంట్ నిధులు స్వాహా

అనంతపురం ఎడ్యుకేషన్ : ఫోర్జరీ సంతకాలతో కోట్లాది రూపాయలు గోల్‌మాల్ చేసిన కుంభకోణం ఇటీవల ఎస్కేయూలో వెలుగులోకి వచ్చిన విషయాన్ని మరువకముందే స్థానిక ఆర్ట్స్ కళాశాలలో అలాంటి వ్యవహారం బయట పడింది. పీజీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు రూ. 9 లక్షలు పక్కదారి పట్టాయి. ఇందుకు కారణమైన సీనియర్ అకౌంటెంట్ జాన్ ఆనంద్‌కుమార్ తన తప్పును  రాతపూర్వకంగా అంగీకరించారు.

వివరాలిలా ఉన్నాయి. ఆర్ట్స్ కళాశాల పీజీ విద్యార్థుల్లో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకు ప్రభుత్వం రూ. 1200 నుంచి రూ. 20 వేలు దాకా వివిధ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తోంది. ఈ క్రమంలో సీనియర్ అకౌంటెంట్ విద్యార్థుల సంతకాలను ఫోర్జరీ చేసి  ఆ డబ్బు కాజేశాడు. 2013 నుంచి ఈ వ్యవహారం సాగింది.  రికార్డులు పరిశీలిస్తే విషయం బయడపడుతుందని భావించిన ఆయన విషయూన్ని ప్రిన్సిపాల్ రంగస్వామికి వివరించాడు.

తీసుకున్న డబ్బు తిరిగి బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని వేడుకున్నాడు. పది రోజులుగా ఈ తతంగా సాగుతోంది. ఉన్నతాధికారుల విచార ణ చేస్తే సమస్యలు తలెత్తుతాయని కళాశాల అధికారులు భావించారు. సీనియర్ అకౌం టెంట్‌పై  ఆర్జేడీ, కమిషనరుకు ఫిర్యాదు చేశారు. కమిషనరు ఆదేశాలతో విచారణకు కమిటీ  వేయనున్నారు.
 
స్వాహా చేసిందిలా : సాధారణంగా విద్యార్థులకు చెక్కులు అందజేసేటప్పుడు ‘అకౌంట్ పే’ చెక్కులు ఇస్తారు. బ్యాంకు ఖాతాలు లేవని విద్యార్థులు తెలపడంతో  వారికి ఁబారోవర్ చెక్*లు కూడా ఇస్తున్నారు. ఈ చెక్కు తీసుకెళ్లి బ్యాంకుకు అందజేస్తే డబ్బు చెల్లిస్తారు. ఇదే అదనుగా కొందరు విద్యార్థుల సహకారంతో చెక్కులను డ్రా చేరుుంచి ఇప్పటిదాకా రూ.9 లక్షలు డ్రా చేశాడని కళాశాల అధికారులు చెబుతున్నారు. నిధులు స్వాహా అరుున విషయూన్ని ప్రిన్సిపాల్ ధ్రువీకరించారు.
 
టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆందోళన
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే సమాచారంతో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకులు బుధవారం కళాశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ చాంబర్‌లో బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరింత లోతుగా విచారణ చేసి కారకులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ. నారాయణస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు కే. జగదీష్, నాయకులు మహేష్, శంకర్, తారక్, మల్లికార్జున, శివ, హరీష్, మంజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు