గొర్రెలు, మేకల వివాహ వేడుక

17 Jan, 2020 10:42 IST|Sakshi
గొర్రె, మేకల జంటలకు తాళి కడుతున్న దృశ్యం

ఇదో వింత తంతు 

గొర్రెలు, మేకల జంటల వివాహాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సామూహిక వివాహతంతుకి గొల్లలపాలెం వేదికయింది. ఆత్మీయులందరూ తరలివచ్చారు. కొత్త జంటల్ని ఆశీర్వదించారు. మీరు చదువుతున్నది నిజమే. ఇదొక సంప్రదాయం.                                      

రావికమతం(చోడవరం): మందల్లో ఉండే జంతువులు రోగాలపాలవకుండా.. సంతానాభివృద్ధి కోసం ఇలా పెళ్లిళ్లు జరిపిస్తామని చెబుతున్నారు యాదవులు. తమ పూరీ్వకులు పాటించిన ఆచారాన్నే తాము కొనసాగిస్తున్నామని వివరించారు. పెళ్లి ఇలా.. మందలో ఉండే గొర్రెపోతుతో గొర్రెలకు.. మేకపోతుతో మేకలకు పెళ్లి జరిపిస్తారు. ప్రతీ ఏటా కనుమ పండగ రోజున దీనికి ముహూర్తంగా నిర్ణయిస్తారు. పెళ్లిరోజు ఉదయాన్నే గ్రామంలోని వారు సమీపంలోని పుట్టవద్దకు చేరుకుంటారు. తమ మందల్లోని గొర్రెలు, మేకలకు పసుపురాసి బొట్టుపెడతారు. ధూపం కూడా వేస్తారు. ఆపై ‘మాంగళ్యధారణ’ చేస్తారు. అనంతరం గొర్రెలు, మేకల చెవుల చిగుర్లను కోసి పుట్టలో వేస్తారు. గురువారం కనుమ సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఇది తమ వంశాచారమని రైతులు పల్లా చినబాబు,దేముడుబాబు,గోపన్న చెప్పారు.  

మరిన్ని వార్తలు