మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి

15 Sep, 2019 17:59 IST|Sakshi

సాక్షి, దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటులో సుమారు 60మందికి పైగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వరంగల్‌ నుంచి తాము 14మంది వచ్చామని, లాంచీ ఒక్కసారిగా పక్కకు ఒరుగుతూ నీళ్లలో మునిగిపోయిందని కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్‌ తెలిపారు. భయంతో కొంతమంది లాంచీ పైకి ఎక్కమన్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ పడవ తమను రక్షించిందని తెలిపారు. అయితే తమ కళ్ల ముందే కొంతమంది నీటిలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బోటులో ప్రయాణిస్తున్న చాలామంది లైఫ్‌ జాకెట్లు వేసుకోలేదని తెలిపారు. కాగా లాంచీలో మొత్తం 71మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 61మంది ప్రయాణికులు కాగా, 10మంది లాంచీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

చదవండి: 

బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!

పాపికొండలు విహార యాత్రలో విషాదం!

రాయల్‌ వశిష‍్టకు అనుమతి లేదు...

బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ సీరియస్‌

వరంగల్‌ నుంచి విహార యాత్రకు వెళ్లినవారు
ధర్మరాజు
రాజేందర్‌
వెంకటస్వామి
బస్కే దశరథం
వెంకటయ్య
ప్రసాద్‌
అవినాష్‌
దర్శనాల సురేశ్‌
సునీల్‌
అరెపల్లి యాదగిరి
గొర్రె రాజేందర్‌
కొండూరి రాజ్‌ కుమార్‌
కొమ్మల రవి
గొర్రె ప్రభాకర్‌

సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద బోటు ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు