గోదావరి జలాలకు పూజలు

16 Jul, 2016 01:13 IST|Sakshi
గోదావరి జలాలకు పూజలు

రంగన్నగూడెం (హనుమాన్‌జంక్షన్ రూరల్) / గన్నవరం రూరల్ : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు పోలవరం కుడికాలువ ద్వారా శుక్రవారం బాపులపాడు మండలానికి చేరాయి. మండల పరిధిలోని రంగన్నగూడెం వద్ద ఉదయం ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు నీటికి హారతులిచ్చారు. జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణారావు, ఎంపీపీ తుమ్మల కోమలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్  వి.వీర్రాజు పూజలు నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వీర్రాజు మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం కాలువలో 2400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో   తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌పీ నూజివీడు ఓ అండ్ ఎం ఈఈ అర్జునరావు, జగ్గయ్యపేట ఎన్‌ఎస్‌పీ ఈఈ శ్రీనివాసరావు, పోలవరం డీఈఈ జె.ప్రసాద్, ఏఈ శ్యామ్‌కుమార్, సర్పంచి ప్రసన్నరావు పాల్గొన్నారు.
 
కొత్తగూడెం చీమలవాగు యూటీ వద్ద..
కొత్తగూడెం(గన్నవరం రూరల్) : మండలంలోని కొత్తగూడెం చీమలవాగు అండర్ టన్నెల్ వద్ద శుక్రవారం పోలవరం కాలువ నీటికి రాష్ర్ట జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు పూజలు చేశారు. నీరు శుక్రవారం ఉదయం 11 గంటలకు బల్లిపర్రు గ్రామానికి నీరు చేరాయి. బల్లిపర్రు, తెంపల్లె, వీరపనేనిగూడెం, కొత్తగూడెం, చింతగుంట, గొల్లనపల్లి, గోపవరపుగూడెం, కట్టుబడిపాలెం దాటి సూరంపల్లి వద్దకు పోలవరంలో నీరు మధ్యాహ్నం 3 గంటలకు చేరాయి.

 

మరిన్ని వార్తలు