ఉదార గోదారి..

19 Jul, 2015 15:23 IST|Sakshi

వీఐపీ ఘాట్ (రాజమండ్రి ) :  అడగందే అమ్మయినా పెట్టదంటారు. అడగకుండానే దప్పిక తీర్చే అపురూపమైన అమ్మ లాంటిది గోదావరి. ఆ తల్లికి జరిగే పెద్దపండుగలో ఆ ఔదార్యమూ వరదలెత్తుతోంది. పుష్కర కాలంలో ప్రతి దినమూ ఇవీ దానాలని శాస్త్రం నిర్దేశించింది. వాటి మాటేమో గానీ.. బాటల పక్కన పాతగుడ్డలు పరిచీ, బొచ్చెలు సాచీ అర్థించే వారిపైన యాత్రికుల కారుణ్యం దండిగానే వర్షిస్తోంది. పుష్కరాల సందర్భంగా యాచకులను ఘాట్ల దరికి రానివ్వద్దని ఓ మంత్రి గారు సెలవిచ్చినా.. పాపం వివిధ జిల్లాల నుంచి 10 వేల మంది యాచకులు రాజమండ్రి వచ్చినట్టు అంచనా. పారే నదిలో మునకేస్తేనే కాదు.. సాచే చేతిలో తోచినది వేసినా పుణ్యమే కదా! గోదారమ్మను కోరినవి ఇమ్మని అర్థించడమే కాదు.. నోరు తెరిచి అర్థించే వారి మొరను మన్నించడమూ పుణ్యమే కదా!

మరిన్ని వార్తలు