అమ్మమ్మ ఇంటికి వెళుతూ.. అనంత లోకాలకు

17 Dec, 2013 03:28 IST|Sakshi
అమ్మమ్మ ఇంటికి వెళుతూ.. అనంత లోకాలకు

నర్సింహులపేట, న్యూస్‌లైన్ : అమ్మమ్మ ఇంటికి వెళదామనగానే ఆ ఇద్దరు చిన్నారులు నిమిషాల్లో రెడీ అయిపోయూరు.. తండ్రి ద్విచక్రవాహనం స్టార్ట్ చేయగానే ముందు ఎక్కి కూర్చున్నారు. ఆ ప్రయూణమే ఆ పసిపిల్లలకు ఆఖరి ప్రయూణమైంది. ముందు వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో అక్కాచెల్లెలు అక్కడికక్కడే మృతిచెందగా, వారి తల్లిదండ్రులు, తమ్ముడు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కుమ్మరికుంట్ల శివారులో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం...

కుమ్మరికుంట్లకు చెందిన చిరగా ని శ్రీనివాస్, ప్రవళిక దంపతులకు కుమార్తెలు సింధూ(లాస్య)(6), శశి(శ్రీవల్లి)(5), కుమారుడు కిట్టు(18 నెలలు) ఉన్నా రు. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం అత్తగారింటి వద్ద నిర్వహించే కోర్ల పౌర్ణమి(పండగ)కి హాజరయ్యేందుకు అతడు తన భార్య, పిల్లలను తీసుకుని ఇదే మండలంలోని వేములపల్లి శివారు దొనకొండకు బయల్దేరాడు. అమ్మమ్మ ఇంటికి వెళదామనగానే సింధూ, శశి సంతోషంతో కొత్త బట్టలు వేసుకుని రెడీ అయిపోయి ద్విచక్ర వాహనం ముందు ట్యాంక్‌పై కూర్చున్నారు. వెనుక కుమారుడిని పట్టుకుని భార్య కూర్చోగా శ్రీనివాస్ బైక్ నడుపుతున్నాడు.

గ్రామం నుంచి అర కిలోమీటర్ దూరం వెళ్లగానే ఎదురుగా ఓ వాహనం వేగంగా రావడంతో దానిని తప్పించబోయి శ్రీనివాస్ ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. గడ్డి లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ కిందికి బైక్ దూసుకెళ్లడంతో ముందు భాగంలో కూర్చున్న కుమార్తెలు సింధూ, శశి  అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీనివాస్, తల్లి ప్రవళికకు తీవ్ర గాయూలయ్యూయి. 18 నెలల చిన్నా రి బాలుడు కిట్టు క్షేమంగా బయటపడ్డాడు. ముగ్గురిని తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
 
కన్నీటిసంద్రమైన కుమ్మరికుంట్ల

 సంఘటన స్థలానికి ప్రజలు వందలాదిగా చేరుకున్నారు. చిన్నారుల మృతితో కుమ్మరికుంట్ల, దొనకొండలో విషాద ఛాయలు అలుముకున్నా యి. గ్రామస్తులు కన్నీటి పర్యం తమయ్యూరు.
 
సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ

 సంఘటన స్థలాన్ని మానుకోట డీఎస్పీ శోభన్‌కుమార్, సీఐ సార్ల రాజు, ఎస్సై వెంకటప్రసాద్ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వై.వీ.ప్రసాద్ వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు