57 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత

10 Apr, 2019 10:46 IST|Sakshi

ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో భారీగా బంగారం స్వాధీనం

సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో భారీగా బంగారం పట్టుబడింది. సరిహద్దులోని ఆరంబాక్కంలో రూ. 57 కోట్లు విలువచేసే 175 బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ బంగారం పట్టుబడింది. ఏపీకి చెందిన సిద్ధార్థ్‌ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు తేల్చినట్లు తెలుస్తోంది.

సిమెంట్‌ లారీలో నెల్లూరు నుంచి ముంబైకి తరలిస్తున్న యత్నంలో బంగారం పట్టుబడింది. లారీని సీజ్‌ చేసిన అధికారులు బంగారం ఎవరిదన్న కోణంలో మరింత లోతుగా విచారిస్తున్నారు. కాగా స్వాధీనం చేసుకున్న బంగారం ఓటర్లకు పంచడానికి తరలిస్తున్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రా ప్రాంతాల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు