పట్టుబడిన బంగారం టీటీడీదేనా?

21 Apr, 2019 18:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరుమల: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో తమిళనాడులో పట్టుబడిన 1381 కేజీల బంగారం టీటీడీదేనా కాదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బంగారం తరలిస్తోన్న సమయంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అధికారులు తగిన ఆధారాలు చూపకపోవడంతో ఎన్నికల అధికారులు సీజ్‌ చేసిన సంగతి తెల్సిందే. రూ.400 కోట్ల విలువ చేసే బంగారం నలుగురు వ్యక్తులు తీసుకువెళ్లడం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కనీస భద్రత కూడా లేకుండా శ్రీవారి బంగారం తరలించడంతో ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది.  ఈ బంగారం విషయంపై మొదట టీటీడీ ఈవోను ప్రశ్నించగా తనకేమీ తెలియదనంతో మరింత అనుమానం పెరిగింది.బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, టీటీడీ అధికారుల ఉత్సాహం వెనక పెద్ద స్కాం ఉందని రాజకీయ నాయకులు, పీఠాధిపతులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. చెన్నైలో ఎన్నికల అధికారులు సీజ్‌ చేసిన 1381 కేజీల బంగారం చివరికి టీటీడీకి చెందినదిగా గుర్తించారు. రూ.50 లక్షలకు మించితే బ్యాంకు సెక్యూరిటీతో పాటు పోలీస్‌ భద్రత తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. కానీ కనీస భద్రత లేకుండా, ఆధారాలు లేకుండా ఎలా తీసుకెళ్లారని టీటీడీ మాజీ సభ్యుడు భాను ప్రకాశ్‌ ప్రశ్న లేవనెత్తారు. ఈ విషయం గురించి కేంద్ర ఆర్ధిక శాఖకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌