నాకు నువ్వు.. నీకు నేను

13 Sep, 2015 23:37 IST|Sakshi
నాకు నువ్వు.. నీకు నేను

విద్యార్థుల క్షవరాల నిధులు గోల్‌మాల్
 
పాడేరు: మన్యంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ కంటింగ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు వార్డెన్స్ కైంకర్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు నాకు నువ్వు.. నీకు నేను అన్న చందంగా ఒకరినొకరు హెయిర్ కంటింగ్ చేసుకుంటున్నారు.

మన్యంలోని 11 మండలాల్లో  66 గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలు, 11 బాలుర వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో  దాదాపు  22 వేలు మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరి ఒక్కొక్కరికి  నెలకు హెయిర్ కంటింగ్ కోసం ప్రభుత్వం రూ. 12లు అందిస్తోంది. ఏడాదిలో రెండు, మూడు పర్యాయలు నిధులు విడుదల చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా. ఈ నిధులతో ఏ ఒక్క ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కంటింగ్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

విద్యార్థులే సొంత డబ్బులతో హెయిర్ కంటింగ్ చేసుకుంటున్నట్లు పరిశీలనలో వెల్లడైంది. సెలవులకు ఇళ్లకు వె ళ్లినప్పుడు ఇంటి వద్ద కంటింగ్ చేసుకుని వస్తున్నామని మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులే ఒకరినొక రు హెయిర్ కంటింగ్ చేసుకుంటూ కనిపించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు హెయిర్ కంటింగ్ ఛార్జీలు అమలు చేస్తున్నారు. గిరిజన ఆశ్రమాలు వద్దకు వచ్చే సరికి ఈ నిధులు వార్డెన్లు జేబుల్లో వేసుకుంటున్నారనేది తేటతెల్లం అవుతోంది.
 
 

>
మరిన్ని వార్తలు