సమాచార హక్కు చట్టంతో సుపరిపాలన

28 Aug, 2017 05:21 IST|Sakshi
సమాచార హక్కు చట్టంతో సుపరిపాలన

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  ప్రభుత్వ సంక్షేమాలు, ఫలాలు సామాన్యుల చెంతకు చేరాలంటే రాజ్యాంగం ప్రసాదించిన సమాచార హక్కు చట్టం (స.హ.చట్టం) అమలు ద్వారానే సాధ్యమవుతుందని స.హ.చట్టం ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు శీలం నాగార్జున అన్నారు. నగరంలోని విద్యాధరి  కళాశాలలో ఐక్యవేదిక జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాలు అవినీతిరహితంగా, పారదర్శకంగా అమలుకావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

ఒకేసారి మార్పు సాధ్యం కాదని, దశలవారీగా సాధించాలని, అందుకు నిరంతర కృషి అవసరమని పేర్కొన్నారు. ప్రజా చైతన్యం, పరస్పర సహకారంతో చట్టం శతశాతం అమలవుతుందన్నారు. ఇందుకు విద్యావంతులు, మేధావులు, యువత సహకారం అవసరమని చెప్పారు. ఐక్యవేదిక ఉత్తరాంధ్ర సమన్వయ కర్త పుట్టా గంగయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ప్రజలకు క్షేత్రస్థాయిలో చేరాలని, అప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రతినిధులు అంగర  రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
   
సమాచార హక్కు చట్టం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షునిగా సీపాన గోవిందరావు, ప్రధాన కార్యదర్శిగా జె.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఎం.రవికుమార్, శ్రీహరి, బి.మోహనరావు, కార్యదర్శులుగా పి.చంద్రపతిరావు, జె.గోవిందరావు, కార్యాలయం కార్యదర్శులుగా ఎం.సుబ్బారావు, యు.వి.రమణ, కోశాధికారిగా బి.సురేష్, డివిజన్‌ సమన్వయకర్తలుగా అమిరుల్లా బేగ్, పి.వెంకట్రావు, మీడియా కన్వీనర్‌గా ఎం.రామకృష్ణారావు, ఢిల్లీచైతన్యలను ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు